ETV Bharat / business

లావాదేవీ రూ.2 కోట్లు దాటితే ప్రవాసులపై పన్ను!

author img

By

Published : May 7, 2021, 2:10 PM IST

NRIs transactions under Tax Regime
పన్ను పరిధిలోకి ఎన్​ఆర్​ఐల లావాదేవీలు

ప్రవాసుల లావాదేవీలను పన్ను పరిధిలోకి తెచ్చే నూతన నిబధనలను నోటిఫై చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). ఈ కొత్త నిబంధన ప్రకారం.. వ్రవాసుల జరిపే లావాదేవీ విలువ రూ.2 కోట్లు దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

భారతీయ వ్యాపార భాగస్వాములతో లావాదేవీలు జరిపే ప్రవాసులు ఇకపై పన్ను పరిధిలోకి రానున్నారు. భౌతికంగా భారత్​లో లేకపోయినప్పటికీ.. డిజిటలైజ్డ్​గా భారత్​లో లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

కేంద్ర ప్రత్యక పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా ఈ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి భారత్​లో వ్యాపారాలను సాగిస్తున్న ఎవరైనా రూ.2 కోట్లకు మించి లావాదేవీలు జరిపితే.. వాటిపై పన్ను విధించనుంది సీబీడీటీ.

భారత్​లో ఉన్న ఏ వ్యక్తి నుంచైనా ప్రాపర్టీ, వస్తు సేవలు, డేటా డౌన్​ లోడ్​, సాఫ్ట్​వేర్ కొనుగోలు వంటి లావాదేవీలన్నీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి రానున్నాయి.

ఇదీ చదవండి:పన్ను పరిధిలోకి గూగుల్, ఫేస్‌బుక్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.