ETV Bharat / business

అక్టోబర్​లో తయారీ రంగ పీఎంఐ రికార్డు వృద్ధి!

author img

By

Published : Nov 2, 2020, 12:46 PM IST

తయారీ రంగ పీఎంఐ అక్టోబర్​లో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదిక ప్రకారం తయారీ రంగ పీఎంఐ గత నెల 58.9 గా నమోదైంది.

PMI RISE IN OCTOBER
అక్టోబర్​లో తయారీ రంగం జోరు

దేశ తయారీ రంగ కార్యకలాపాలు వరుసగా మూడో నెలలోనూ పుంజుకున్నాయి. అమ్మకాల్లో వృద్ధికి అనుగుణంగా.. 13 ఏళ్లలోనే కంపెనీలు అత్యధిక ఉత్పత్తిని పెంచినట్లు ఓ నివేదిక తెలిపింది.

ఐహెచ్​ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక ప్రకారం తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్​లో 58.9కి పెరిగింది. సెప్టెంబర్​లో ఇది 56.8 వద్ద ఉంది. ఇది దశాబ్ధకాలంలోనే అత్యధిక వృద్ధి అని ఐహెచ్​ఎస్​ మార్కిట్ పేర్కొంది.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో.. తయారీ రంగ పీఎంఐ 32 నెలల వరుస వృద్ధి తర్వాత.. ఏప్రిల్​లో భారీగా క్షీణించింది. అ తర్వాత అన్​లాక్​తో తిరిగి వృద్ధి సాధిస్తున్నట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ వివరించింది.

ఇదీ చూడండి:వైద్య ఖర్చులకు ప్రభుత్వ సాయం అంతంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.