ETV Bharat / business

క్రెడిట్​ స్కోరు తక్కువున్నా రుణాలు పొందండిలా..

author img

By

Published : Mar 31, 2021, 2:12 PM IST

Credit score priority in the case of loans
స్కోరు తక్కువున్నా రుణం పొందొచ్చు

రుణాలు పొందేందుకు క్రెడిట్ స్కోరు చాలా కీలకం. బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు రుణాలిచ్చేందుకు మంచి క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. మరి క్రెడిట్​ స్కోరు తక్కువగా ఉన్నవారు రుణాలు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోరు రుణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 700 కంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే తిరిగి చెల్లించే సామర్థ్యం అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఎక్కువ స్కోరు ఉన్న వారికి వ్యక్తిగత రుణం త్వరగా వస్తుంది.

తక్కువ స్కోరు ఉన్న వారు రుణాలు పొందేందుకు, ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు పొందేందుకు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా రుణం కావాల్సినప్పుడు ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దం.

తక్కువ వ్యక్తిగత రుణం మొత్తం

తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు ఎక్కువ రిస్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. తక్కువ క్రెడిట్​ స్కోరు ఉన్నవాళ్లు.. మొదటగా తక్కువ మొత్తంలో రుణం తీసుకుని కొన్ని వాయిదాలు చెల్లించిన తరువాత టాప్ అప్ లోన్ తీసుకోవటం ఉత్తమం. దీని వల్ల రుణం ఇచ్చే సంస్థల అనుమానాలు నివృత్తం కావటమే కాకుండా.. తక్కువ మొత్తం వాయిదా వల్ల చెల్లింపుదారుడికి కూడా ఇబ్బంది ఉండదు.

ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పణ

చాలా వరకు బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు.. క్రెడిట్ స్కోరుతో పాటు ప్రస్తుత వేతనం, ఇతర ఆదాయ వనరులను కూడా రుణం ఇచ్చే విషయంలో పరిగణనలోకి తీసుకుంటాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న పక్షంలో వేతన పెరుగుదల, వార్షిక బోనస్, ఇతర ఆదాయ వనరుల గురించిన బ్యాంకు స్టేట్మెంట్ లాంటి సాక్ష్యాలు సమర్పించాలి. వీటి వల్ల తిరిగి చెల్లించే సామర్థ్యంపై రుణాలిచ్చే సంస్థలకు నమ్మకం కలగించవచ్చు.

క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే...

క్రెడిట్ రిపోర్టులో తప్పులు జరగవచ్చు. ప్రతి ఆరు నెలలకు ఓ సారి క్రెడిట్ రిపోర్టును పరిశీలించుకోవాలి. ఏవైనా తప్పులు జరిగినట్లు గమనిస్తే.. దాన్ని రిపోర్టు చేయవచ్చు. కొన్ని సార్లు అప్​డేట్ కాని పక్షంలో కూడా క్రెడిట్ స్కోరు దెబ్బ తినవచ్చు. వాటిని సరి చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోరు మంచి స్థాయిలో ఉండి.. రుణం పొందటం సులభం అయ్యే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:మార్చి 31 డెడ్​లైన్​- కొత్త రూల్స్​ ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.