ETV Bharat / business

క్యూ4లో ఎస్​బీఐ లాభం రూ.6,451 కోట్లు

author img

By

Published : May 21, 2021, 2:19 PM IST

Updated : May 21, 2021, 3:19 PM IST

SBI results for FY21
ఎస్​బీఐ క్యూ4 ఫలితాలు

2020-21 చివరి త్రైమాసికంలో ఎస్​బీఐ లాభం 80 శాతం పెరిగినట్లు ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య రూ.6,451 కోట్ల లాభాన్ని గడించినట్లు తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను.. రూ.20,110.17 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వివరించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ 2020-21 చివరి త్రైమాసికంలో రూ.6,450.75 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2019-20 ఇదే సమయంలో నమోదైన రూ.3,580.81 కోట్ల లాభంతో పోలిస్తే ఈ మొత్తం 80 శాతం ఎక్కువ.

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.81,326.96 కోట్లుగా నమోదైంది. 2019-20 ఇదే సమయంలో బ్యాంక్​ ఆదాయం రూ.76,027.51 కోట్లుగా ఉంది.

ఈ ఏడాది మార్చి 31 నాటి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 6.15 శాతం(2020 మార్చి 31 నాటికి) నుంచి 4.98 శాతానికి మెరుగైనట్లు ఎస్​బీఐ పేర్కొంది. ఇదే సమయంలో నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.23 శాతం నుంచి.. 1.50 శాతానికి దిగొచ్చినట్లు వివరించింది.

400 శాతం డివిడెండ్..

2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్​బీఐ నికర లాభం 41 శాతం పెరిగి.. రూ.20,110.17 కోట్లుగా నమోదైంది.

భారీ లాభాల నేపథ్యంలో.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక షేరుకు రూ.4 లేదా ముఖ విలువపై 400 శాతం డివిడెండ్​ను బ్యాంక్ బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్​ చెల్లింపు తేదీని జూన్ 18గా నిర్ణయించింది.

ఇదీ చదవండి:జూన్ 1న మార్కెట్లోకి కోటి 'కొవిసెల్ఫ్​' టెస్ట్​ కిట్​లు!

Last Updated :May 21, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.