ETV Bharat / business

రూ.74 లక్షల కోట్లు దాటిన ఫేస్​బుక్​ మార్కెట్ విలువ!

author img

By

Published : Jun 29, 2021, 12:57 PM IST

Value of Facebook
ఫేస్​బుక్​ కంపెనీ విలువ ఎంత

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్​ షేర్లు సోమవారం 4 శాతానికిపైగా పెరిగాయి. దీనితో సంస్థ మార్కెట్ విలువ తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ఫేస్​బుక్​ షేర్ల పరుగుకు కారణాలు ఇలా ఉన్నాయి.

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ మరో రికార్డు సాధించింది. తొలి సారి కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.74 లక్షల కోట్ల పైమాటే.

అమెరికా స్టాక్ మార్కెట్లో ఫేస్​బుక్​ షేర్లు సోమవారం 4 శాతానికిపైగా.. పెరిగిన నేపథ్యంలో సంస్థ మార్కెట్​ విలువ ఈ స్థాయికి పెరిగింది. ఫేస్​బుక్ షేరు ధర ప్రస్తుతం 355.64 డాలర్ల వద్ద ఉంది.

షేర్ల పరుగుకు కారణం..

ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్ వంటి సంస్థలను బలవంతంగా కొనుగోలు చేసిందంటూ ఫేస్​బుక్​కు వ్యతిరేకంగా కొలంబియా జిల్లా కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఈ విషయం సహా.. సోషల్ నెట్​వర్కింగ్​ మార్కెట్​లో గుత్తాధిపత్యానికి ఫేస్​బుక్​ ప్రయత్నిస్తోందనే వాదనను ఫిర్యాదు దారు నిరూపించలేకపోయారు. దీనితో ఈ కేసును కొట్టివేసింది న్యాయ స్థానం. ఈ విషయంపై ప్రకటన వెలువడగానే ఫేస్​బుక్​ షేర్లు భారీగా పుంజుకున్నాయి. అయితే ఈ విషయంపై మరో పిటిషన్ దాఖలు చేసేందుకు మాత్రం అవకాశం ఇచ్చింది కోర్టు.

మరిన్ని వివరాలు..

ఫేస్​బుక్​ 2004లో ప్రారంభమైంది. మార్క్​ జుకర్​బర్గ్ కేంబ్రిడ్జ్​ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులతో కలిసి దీనిని నెలకొల్పారు. మార్క్​ జుకర్​బర్గే ప్రస్తుతం ఫేస్​బుక్​ సీఈఓగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 111 భాషల్లో సేవలందిస్తోంది ఫేస్​బుక్​.

2010లో ప్రారంభమైన ఇన్​స్టాగ్రామ్​ను 2012లో..1 బిలియన్​ డాలర్లకు (రూ.7,430 కోట్లు దాదాపు) స్వాధీనం చేసుకుంది ఫేస్​బుక్​. ఆ తర్వాత వాట్సాప్​ను 2014లో 19 బిలియన్ డాలర్లకు (రూ.141,165 కోట్లు దాదాపు) కొనుగోలు చేసింది. వాట్సాప్ 2009 నుంచి సేవలందిస్తోంది.

ఇదీ చదవండి:టెలిగ్రామ్​లో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.