ETV Bharat / business

నిషేధంపై టిక్​టాక్ స్పందన ఏంటంటే?

author img

By

Published : Jun 30, 2020, 10:40 AM IST

Updated : Jun 30, 2020, 12:43 PM IST

టిక్​ టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్రం విధించిన నిషేధాజ్ఞలను పాటించే పనిలో పడ్డాయి గూగుల్​ ప్లే స్టోర్, యాపిల్ ఐ స్టోర్​లు. ఇప్పటికే వీటి ప్లాట్​ఫాంల నుంచి టిక్​ టాక్​ను తొలగించాయి. మిగతా యాప్​లను త్వరలోనే తొలగించే అవకాశముంది.

tik tok removed from play store
ప్లే స్టోర్ నుంచి టిక్​ టాక్ తొలగింపు

చైనాకు చెందిన టిక్​టాక్ యాప్​ను భారత్​లో ప్లే స్టోర్, ఐ స్టోర్​లు తొలగించాయి. దేశ అంతర్గత భద్రతా కారణాలతో టిక్​టాక్ సహా 59 చైనా యాప్​లను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రస్తుతానికి టిక్​ టాక్, హలో యాప్​లను ప్లే స్టోర్​ నుంచి తొలగించగా.. మిగతా నిషేధిత యాప్​లను త్వరలోనే తొలగించే అవకాశముంది.

టిక్​ టాక్ ఏమంటోంది..

తమ యాప్​పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టిక్​ టాక్ స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించే ప్రక్రియలో ఉన్నామని వెల్లడించింది. అయితే భారత టిక్​ టాక్ యూజర్ల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతో పంచుకోలేదని పేర్కొంది టిక్​ టాక్.

ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి యాప్​ను తిరిగి పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను వెతుకుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 30, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.