ETV Bharat / business

'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు!'

author img

By

Published : Jun 30, 2020, 6:23 PM IST

చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతోన్న అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ).. భారత అంకురాల్లో చైనా పెట్టుబడులపైనా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశీయ స్టార్టప్​ల సమాచారం చైనా పెట్టుబడిదారులకు వెళ్లకుండా, దాని ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తూ.. కేంద్రం ఆర్థిక, వాణిజ్య, ఐటీ శాఖలకు లేఖలు రాసింది.

CAIT
'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు చేయాలి'

భారత్​లోని అంకుర సంస్థల్లో చైనా కంపెనీల పెట్టుబడులపై దర్యాప్తు చేపట్టాలని కోరింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ). చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అంకురాల విలువైన సమాచారం చైనాకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేసింది. స్టార్టప్​ల పరిజ్ఞానం చైనా పెట్టుబడిదారులకు వెళ్లకుండా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది.

పెట్టుబడుల పేరుతో ఎలాంటి దొంగాటలకు పాల్పడేందుకు తావివ్వకుండా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​కు లేఖలు రాసింది సీఏఐటీ.

" భారత్​లో పరిశ్రమలు నెలకొల్పిన చైనా సంస్థలు పొందిన సమాచారం దుర్వినియోగం అయిందా లేక చైనాకు చేరవేశారా అనే కోణంలోనూ వాటిపై దర్యాప్తు చేయాలి. భారత్​లోని అంకుర సంస్థల్లో చైనా కంపెనీలకు భారీగా పెట్టుబడులు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాం. అందులో కొన్ని.. ఫ్లిప్​కార్ట్​, పేటీఎం మాల్​, పేటీఎం.కామ్​, స్విగ్గీ, ఓలా, ఓయో, జొమాటో, పాలసీ బజార్​, బిగ్ ​బాస్కెట్​, దిల్లీవెరీ, మేక్​మై ట్రిప్​, డ్రీమ్​ 11, హైక్​, స్నాప్​డీల్​, ఉడాన్​, లెన్స్​కార్ట్​.కామ్​, బైజూ క్లాసెస్. చైనా కంపెనీలైన అలీబాబా, టెన్సెంట్​ వంటి పలు సంస్థలు ఈ స్టార్ట్​అప్​లలో ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. పెట్టుబడుల పేరిట ఎలాంటి అక్రమాలు జరగకుండా చాడాలి.

- ప్రవీణ్​ కందేల్వాల్​, సీఏఐటీ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: చైనా ఫోన్లు మార్చాలా? వీటిపై లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.