ETV Bharat / business

డెల్టా వేరియంట్ భయాలు- ట్విట్టర్​ ఆఫీస్​ మూసివేత

author img

By

Published : Jul 29, 2021, 7:35 PM IST

new CDC rules in US
కరోనా డెల్టా వేరియంట్​ భయాలు

కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర రూపం దాల్చొచ్చన్న భయాలతో అమెరికా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్​ న్యూయార్క్​, శాన్​ఫ్రాన్సిస్కోల్లోని తమ ఆఫీసులను తాత్కాలికంగా మూసేసింది.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్​, శాన్​ఫ్రాన్సిస్కోల్లో ఉన్న సంస్థ కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ ప్రివెన్షన్​ (సీడీసీ) తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రెండు వారాల క్రితమే (జులై 12న) ట్విట్టర్​ ఆఫీస్​ను పునఃప్రారంభించడం గమనార్హం.

కరోనా డెల్టా వేరియంట్​ విజృంభణ భయాలతో.. సీడీసీ తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. టీకా తీసుకున్న వ్యక్తులు ఇంట్లో, బయట మాస్క్​లు ధరించడం తప్పనిసరికాదంటూ.. ఇంతకు ముందు చేసిన ప్రకటనను కూడా వెనక్కి తీసుకుంది. వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ.. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీగా ఉండే ఇండోర్​ ప్రాంతాల్లోనూ మాస్క్ ధరించాలని సూచించింది.

ఇతర టెక్ కంపెనీలు కూడా నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి కార్యాలయాలకు తిరిగి వచ్చే ముందే.. ఉద్యోగులందరికి టీకా పంపిణి పూర్తి చేయాలని సీడీసీ సూచించినట్లు.. గూగుల్​, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్​ పిచాయ్​ తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా ఉన్న 270స్టోర్లలో వినియోగదారులు, సిబ్బంది తప్ప కుండా మాస్క్ ధరించేలా చూడాలని.. సీడీసీ మార్గదర్శకాలు జారీ చేసినట్లు యాపిల్​ వెల్లడించింది. అమెజాన్​, ఫేస్​బుక్ వంటి కంపెనీలు ఈ మార్గదర్శకాల గురించి ప్రకటించాయి.

స్ట్రీమింగ్ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​కు కూడా ప్రొడక్షన్​లో నటీ-నటులు, సిబ్బందికి వ్యాక్సినేషన్​ తప్పనిసరి చేసింది సీడీసీ. ఈ విషయాన్ని నెట్​ఫ్లిక్స్ కూడా స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఆ సంస్థలో కొత్తగా లక్షా 30 వేల ఉద్యోగాలు- ఏడాదిలోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.