ETV Bharat / business

ఆ సంస్థలో కొత్తగా లక్షా 30 వేల ఉద్యోగాలు- ఏడాదిలోనే..

author img

By

Published : Jul 29, 2021, 2:21 PM IST

jobs in cognizant
కాగ్నిజెంట్​లో ఉద్యోగాలు

రెండో త్రైమాసికంలో కాగ్నిజెంట్​ అదరగొట్టింది. నికర ఆదాయంలో ఏకంగా 41.8శాతం వృద్ధిని(గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాదికిగాను తమ సంస్థలో 1.3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్​.. జూన్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. నికర ఆదాయంలో 41.8శాతం వృద్ధిని నమోదు చేసి... 512 మిలియన్​ డాలర్లు(దాదాపు రూ.3,801.7 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర ఆదాయం 361 మిలియన్​ డాలర్లుగా ఉంది. ఈ నేఫథ్యంలో... తాము ఈ ఏడాది లక్ష మందికిపైగా కొత్త ఉద్యోగులను తీసుకుంటామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతమున్న ఉద్యోగులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టనున్నట్లు చెప్పింది.

"రెండో త్రైమాసికంలో మేము మంచి ఫలితాలు నమోదు చేశాం. పెట్టుబడి లక్ష్యాలకు తగ్గట్లుగా... ఆధునిక వ్యాపారాలను నిర్మించేందుకు మా సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ విభాగాలకు విస్తరించాలనుకుంటున్నాం. దీని ద్వారా ఓ బలమైన సంస్థగా కాగ్నిజెంట్​ రూపొందుతుందని ఆశిస్తున్నాం."

-బ్రెయిన్​ హంఫ్రైస్​, కాగ్నిజెంట్​ సీఈఓ

2021లో తమ ఆదాయం... 18.4-18.5 బిలియన్​ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నామని కాగ్నిజెంట్ తెలిపింది. క్లయింట్ల డిమాండ్లకు తగ్గట్టు సేవలందించేందుకు.. కాగ్నిజెంట్​లో ​ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

"ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు వారికి పరిహారాలు ప్రకటించడం, జాబ్ రొటేషన్స్​, నైపుణ్యాలు నేర్పడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా దాదాపు 1,00,000 మంది కొత్తవారిని 2021లో ఉద్యోగాల్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. మరో లక్ష మంది అసోసియేట్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం."

-బ్రెయిన్​ హంఫ్రైస్​, కాగ్నిజెంట్​ సీఈఓ

ఇవేగాకుండా... 2021లో 30,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను ఈ సంస్థ ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022లో ఈ కొత్త ఉద్యోగుల సంఖ్యను 45,000లకు పెంచనున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: బంగారం దేశీయంగా భళా- అంతర్జాతీయంగా డీలా

ఇదీ చూడండి: వీటన్నింటికీ పన్ను మినహాయింపు ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.