ఐటీ ఉద్యోగం కావాలా? ఆన్​లైన్​లో ఈ పరీక్ష రాసేయండి!

author img

By

Published : Sep 19, 2021, 4:01 PM IST

NQT REGISTRATION

ఐటీలో కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. ఎన్​క్యూటీ(నేషనల్​ క్వాలిఫయర్​ టెస్ట్​).. రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది(tcs nqt 2021) టీసీఎస్​. 2021 డిసెంబర్​, 2002 మార్చి కోసం ప్రకటన విడుదల చేసింది(nqt 2021). ఈ పరీక్షతో ప్రయోజనం ఏంటి? ఎవరికి అర్హత? వంటి వివరాలు తెలుసుకోండి.

దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్​.. నేషనల్​ క్వాలిఫయర్​ టెస్ట్​(ఎన్​క్యూటీ)(tcs nqt 2021) రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. 2021 డిసెంబర్​, 2022 మార్చి పరీక్షల కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది(nqt registration).

టీసీఎస్​- ఎన్​క్యూటీకి మంచి డిమాండ్​ ఉంది. ఇందులో ఉత్తీర్ణత సాధించే వారికి టీసీఎస్​తో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులకు వచ్చే స్కోరు.. రెండేళ్ల వరకు చెల్లుతుంది.

ఎన్​క్యూటీ టెస్ట్​.. అర్హత..

  • వివిధ సంస్థల్లో ప్రారంభ, నిపుణుల స్థాయి ఉద్యోగాల కోసం ఈ పరీక్షలు జరుగుతాయి.
  • ఆన్​లైన్​లో లేదా టీసీఎస్​ అయాన్​ పరీక్షా కేంద్రాల్లో టెస్ట్ నిర్వహిస్తారు.
  • యూజీ, పీజీ, డిప్లొమా ప్రీఫైనల్​, ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు, డిగ్రీ, రెండు- అంతకన్నా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులు అప్లై చేయవచ్చు.
  • పరీక్షకు ముందు నాలుగు ప్రాక్టీస్​ టెస్టులు ఉంటాయి.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.