ETV Bharat / business

జులైలో 'ఆటో' గేరు మారుతుందా?

author img

By

Published : Jun 30, 2020, 2:14 PM IST

జులై 1న అన్​లాక్ 2.0​ ప్రారంభం కానుంది. ఈసారి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. ఈ సానుకూలతల ప్రభావం వాహన రంగంపై ఎంతలా ఉండనుంది? రానున్న పెళ్లిళ్ల సీజన్​తో వాహన విక్రయాలు పెరుగుతాయా? అనే విషయాలపై ఓ సర్వే వెల్లడించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

auto sales hike july
జులైలో ఆటో రంగం జోరు

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ సడలింపులతో వాహనాల విక్రయాలు పెరుగుతాయా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రీసెర్చ్​ సంస్థ డొలాట్ క్యాపిటల్​ నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. జూలైలో విక్రయాలు భారీగా పుంజుకోవచ్చని తెలిసింది.

సర్వేలోని మఖ్యాంశాలు..

  • ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఎంక్వైరీలు భారీగా జరుగుతున్నాయి. ఆ సెగ్మెంట్​లో విక్రయాలు పెరుగుతాయనేందుకు ఇది సానుకూల సంకేతం.
  • టైర్​ 2, 3 పట్టణాల్లో లాక్​డౌన్ సడలింపుల కారణంగా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో వ్యక్తిగత భద్రతపై దృష్టి సారించడం ఇందుకు ముఖ్య కారణం.
  • పెళ్లిళ్ల సిజన్​తో జులైలో వాహన విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ వాహన రంగ వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశాలున్నాయి. ఉత్పత్తి పెంపు, మార్కెట్లోకి పెరిగిన సరఫరా వంటి పరిణామాలు ఇందుకు ఊతమందించే వీలుంది.
  • ద్విచక్రవాహనాల విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. ప్యాసింజర్​ వాహనాల డిమాండ్ రికవరీ అస్పష్టంగా ఉంది. ద్విచక్రవాహనాల విక్రయాలు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే వీలుంది.
  • కరోనా కారణంగా తగ్గిన ఆదాయంతో రీప్లేస్​మెంట్, అప్​గ్రేడ్​ కొనుగోళ్లు 50 శాతం వరకు ప్రభావితం కావచ్చు.
  • వర్షాకాలం సాధారణంగానే ఉంటుందన్న అంచనాలతో.. ట్రాక్టర్ల మార్కెట్ వేగంగా రికవరీ సాధించే వీలుంది. వ్యవసాయంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టిసారించడం కూడా ఇందుకు కారణమే.
  • డిమాండు లేక 50 శాతం వాణిజ్య వాహనాలు ఖాళీగా ఉంటున్నాయి. మిగతా 50 శాతం వాహనాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీనితో వాణిజ్య వాహనాల కొనుగోళ్లు అంతగా ఉండకపోవచ్చు.
  • 6 నెలల వరకు ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ ఆర్​బీఐ తీసుకున్న చర్య మాత్రమే వాణిజ్య వాహనదారులకు ఊరట కలిగించే విషయమని సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య వాహనాల కొనుగోళ్లకు ఇచ్చిన రుణాలు మొండిబకాయిలుగా మారొచ్చని బ్యాంకులు, రుణ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
  • త్రిచక్ర వాహనాల (ఆటోలు) విక్రయాలు మాత్రం ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా లాక్​డౌన్​లో ఆటో డ్రైవర్ల ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు 70-80 శాతం మంది ఈఎంఐ మారటోరియంను ఎంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఆటోల కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు ఫినాన్షియర్లు సుముఖత చూపడం లేదని వేర్కొంది.

ఇదీ చూడండి :బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు 'ఆర్డినెన్స్' రూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.