ETV Bharat / business

వారాంతం లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

author img

By

Published : May 8, 2020, 9:33 AM IST

Updated : May 8, 2020, 4:01 PM IST

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్

15:53 May 08

ఆసియా మార్కెట్ల సానుకూలత..

స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 199 పాయింట్లు బలపడి 31,643 వద్దకు చేరింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 9,251 వద్ద స్థిరపడింది.  

కరోనా ప్యాకేజీపై ఆశలకు తోడు.. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ లాభాలను గడించిన నేపథ్యంలో మన మార్కెట్లు సానుకూలంగా ముగిశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

హెచ్​యూఎల్​, నెస్లే, టెక్ మహీంద్రా, సన్​ఫార్మా, రిలయన్స్,  కోటక్ బ్యాంక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

ఎన్​టీపీసీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు నష్టాలతో ముగిశాయి.

14:19 May 08

కాస్త వెనక్కి...

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా వృద్ధితో 31,770 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో 9,300 వద్ద కొనసాగుతోంది.

  • ఆటో, విద్యుత్​, ఇంధన రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
  • రిలయన్స్ షేర్లు అత్యధికంగా 4 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్రా, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎం&ఎం, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఎస్​బీఐ, మారుతీ, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

13:35 May 08

రియలన్స్​ షేర్లు రయ్​..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 482 పాయింట్ల వృద్ధితో 31,925వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 129 పాయింట్లకుపైగా బలపడి 9,328 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోని షేర్లు..

జియోలో విస్టా పెట్టుబడులతో రిలయన్స్ షేర్లు అత్యధికంగా 4.56శాతం లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్​, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ తదితర సంస్థల షేర్లు వృద్ధిలో కొనసాగుతున్నాయి.

యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, టాటాస్టీల్​, టైటాన్​ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:48 May 08

కొనసాగుతున్న లాభాలు..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 510 పాయింట్లకు పైగా లాభంతో 31,960 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లకుపైగా బలపడి 9,344 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో రిలయన్స్ అత్యధికంగా 4 శాతానికిపైగా వృద్ధితో ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, ఎం&ఎం, పవర్​గ్రిడ్​, హీరో మోటోకార్ప్, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:59 May 08

32,000 మార్క్​కు చేరువలో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్లు పుంజుకుని 31,940 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 140 పాయింట్లకుపైగా లాభంతో 9,340 వద్ద కొనసాగుతోంది.

లాక్​డౌన్​తో కుదేలైన అన్ని రంగాలను ఆదుకునేలా కేంద్రం నుంచి త్వరలోనే భారీ ప్యాకేజీ ప్రకటన ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తూ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

రిలయన్స్ జోరు..

హెచ్​యూఎల్​, టీసీఎస్​, మారుతీ, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

జియోలో అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ సంస్థ విస్టా రూ.11 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు సెషన్ ఆరంభంలో 6 శాతానికిపైగా బలపడ్డాయి.

Last Updated : May 8, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.