ETV Bharat / business

లాభాలకు మళ్లీ బ్రేక్.. 9,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ

author img

By

Published : May 7, 2020, 9:29 AM IST

Updated : May 7, 2020, 3:59 PM IST

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

15:49 May 07

మూణ్ణాళ్ల ముచ్చటే..

స్టాక్ మార్కెట్లకు లాభాలు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. బలహీన ఆర్థిక గణాంకాలకుతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలాతో నేడు నష్టాల్లో ముగిశాయి సూచీలు.

సెన్సెక్స్ 242 పాయింట్లు కోల్పోయి 31,443 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 9,199 వద్దకు చేరింది.

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.

ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, కోటక్​ బ్యాంక్, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

13:48 May 07

కొనసాగుతున్న నష్టాలు...

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 280 పాయింట్ల నష్టంతో 31,407 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 80 పాయింట్లు కోల్పోయి 9,190 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • దాదాపు అన్ని రంగాల ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, టెక్​ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

11:43 May 07

మిడ్​ సెషన్ ముందూ నష్టాలే..

మిడ్ సెషన్ ముందు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 120 పాయింట్లకుపైగా నష్టంతో 31,580 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా క్షీణించి.. 9,229 వద్ద కొనసాగుతోంది.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, కోటక్ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:02 May 07

మళ్లీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కార్పొరేట్ల ఫలితాలు మిశ్రమంగా ఉండటం సహా ఆర్థిక గణాంకాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఏప్రిల్​లో సేవల రంగం 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందన్న గణాంకాలు మదుపరుల సెంటిమెంట్​ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 220 పాయింట్లకుపైగా కోల్పోయి 31,463 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 80 పాయింట్లకుపైగా నష్టంతో 9,187 వద్ద కొనసాగుతోంది.

  • హెచ్​సీఎల్​టెక్, సన్​ఫార్మా, మారుతీ, యాక్సిస్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​యూఎల్​, కోటక్ బ్యాంక్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated : May 7, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.