ETV Bharat / business

మార్కెట్లలో లాభాల జోరు- హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​ అదుర్స్​

author img

By

Published : Dec 16, 2020, 9:27 AM IST

Updated : Dec 16, 2020, 2:47 PM IST

stocks Live updates
స్టాక్ మార్కెట్లు లైవ్

14:43 December 16

మార్కెట్లకు భారీ లాభాలు..

దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 370 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 46 వేల 639 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి.. 13 వేల 675 వద్ద ఉంది. 

హెచ్​డీఎఫ్​సీ, ఎల్​అండ్​టీ, టైటాన్​, దివీస్​ ల్యాబ్స్​, టాటా మోటార్స్​ రాణించాయి. 

టెక్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, గెయిల్​ నష్టాల్లో ఉన్నాయి. 

12:18 December 16

జీవితస్థాయి గరిష్ఠాలకు సూచీలు..

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సూచీలు ఇవాళ్టి ట్రేడింగ్​లో జీవితస్థాయి గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్​ 300 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 46 వేల 556 వద్ద ట్రేడవుతోంది. 

నిఫ్టీ 80 పాయింట్లకుపైగా లాభపడింది. ప్రస్తుతం 13 వేల 650 మార్కు ఎగువన ఉంది.  

10:08 December 16

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 46,488 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా వృద్ధితో 13,629 వద్ద కొనసాగుతోంది.

స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు తగ్గట్లుగానే ఉండటం, అంతర్జాతీయ సూచీల సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది. దీనితో పాటు భారత్ అశించిన స్థాయికన్నా వేగంగా పుంజుకుంటున్నట్లు రేటింగ్ ఏజెన్సీలు విడుదల చేస్తున్న నివేదికలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

  • ఎం&ఎం, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్, నెస్లే, పవర్​గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:03 December 16

సూచీల రికార్డుల పర్వం

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయి అయిన 46,585 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 13,657 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

30 షేర్ల ఇండెక్స్​లో ఎం&ఎం, ఓఎన్​జీసీ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాలను గడించాయి. హెచ్​సీఎల్​టెక్ మాత్రమే నష్టాల్లో ఉంది.

Last Updated : Dec 16, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.