ETV Bharat / business

'హాంకాంగ్​ నుంచి 1,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు'

author img

By

Published : Apr 28, 2021, 10:21 PM IST

హాంకాంగ్​ నుంచి దిల్లీకి 1,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తీసుకువస్తున్నట్లు స్పైస్​జెట్​ విమాన సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో వివిధ దేశాల నుంచి 20 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తాము తరలిస్తామని చెప్పింది.

spicejet
స్పైస్​జెట్​లో హాంకాంగ్​ నుంచి ఆక్సిజన్ మిషన్లు

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో.. హాంకాంగ్​ నుంచి దిల్లీకి 1,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తీసుకువస్తున్నట్లు స్పైస్​జెట్​ విమాన సంస్థ తెలిపింది. తమ కార్గో విమానాలైన స్పైస్​ఎక్స్​ప్రెస్​ ద్వారా వీటిని తరలిస్తున్నట్లు చెప్పింది. అత్యవసర వినియోగం కోసం తమ స్పైస్​ హెల్త్​ విభాగంతో పాటు దేశవ్యాప్త పంపిణీ కోసం వీటిని అందజేయనున్నట్లు పేర్కొంది. కోల్​కతా మీదుగా ఈ విమానాలు దిల్లీ చేరుకుంటాయని వెల్లడించింది.

ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల రవాణాలో ఇది తాము చేపట్టిన రెండో అతిపెద్ద ప్రక్రియ అని స్పైస్​ జెట్​ పేర్కొంది. గత రెండు వారాల్లో 2,000కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తరలించామని చెప్పింది. రానున్న రోజుల్లో వివిధ దేశాల నుంచి భారత్​కు 20,000 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను తీసుకురావాలనుకుంటున్నామని స్పైస్​జెట్​ మేనేజింగ్ డైరెక్టర్​ అజయ్​ సింగ్​ తెలిపారు. ఆక్సిజన్ కొరత తీర్చే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులతో తాము మమేకమవుతూ పని చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: ఆర్థిక శాఖ కార్యదర్శిగా టీవీ సోమనాథన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.