ETV Bharat / business

రెండో రోజూ నష్టాలు- 15,100 వద్ద నిఫ్టీ

author img

By

Published : Feb 10, 2021, 3:44 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 20 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 15,100 స్థాయిపైన దాదాపు ఫ్లాట్​గా ముగిసింది. ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి.

stocks today
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బుధవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 51,309 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ అతి స్వల్పంగా 3 పాయింట్లు కోల్పోయి..15,106 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునేపనిలో పడటం సహా.. పలు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు నష్టాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 51,512 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 50,846 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ 15,168 పాయింట్ల అత్యధిక స్థాయి.. 14,977 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్​, ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు లాభాలను గడించాయి.

భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, యాక్సిస్​ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో, సియోల్​, హాంకాంగ్​ (భారీగా) సూచీలు లాభాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి:పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.