ETV Bharat / business

చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్​ దేశాల నిర్ణయం

author img

By

Published : Apr 2, 2021, 5:02 AM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న క్రమంలో చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాయి ఒపెక్​ దేశాలు. అదనంగా రోజుకు 20 లక్షల​ బ్యారెళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించాయి. మే నుంచి జులై మధ్య ఉత్పత్తిని క్రమంగా పెంచాలని తీర్మానించాయి.

OPEC countries
ఒపెక్​ దేశాలు

కొవిడ్​-19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు​. మే నుంచి జులై వరకు చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచనున్నట్లు తెలిపాయి. రోజుకు 2 మిలియన్​ (20 లక్షలు) బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి.

గత ఏడాది కరోనా కారణంగా డిమాండ్​ తగ్గి ధరలు భారీగా పడిపోయిన క్రమంలో ఉత్పత్తిని తగ్గించాయి ఒపెక్​ దేశాలు. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఆర్థిక రంగం క్రమంగా పట్టాలకెక్కుతున్న తరుణంలో ఉత్పత్తిని పెంచుతున్నాయి.

మే నెలలో ప్రస్తుతం చేస్తున్న ఉత్పత్తికి మరో 3,50,00 బ్యారెళ్లు, ఆ తర్వాత జూన్​లో మరో 3,50,000 బ్యారెళ్లు, జులైలో 4 లక్షల బ్యారెళ్లు అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు.. సౌదీ అరేబియా అదనంగా 1 మిలియన్​ బ్యారెళ్ల ఉత్పత్తిని పునరుద్ధరించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.