ETV Bharat / business

మార్కెట్లోకి నోకియా కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవే!

author img

By

Published : Feb 10, 2021, 9:30 PM IST

హెచ్‌ఎండీ గ్లోబల్ రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 పేరుతో ఈ మోడల్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్ లైట్‌ని కూడా విడుదల చేశారు. ఈ మోడల్స్‌ ధరెంత.. ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.

nnokia new phones
మార్కెట్లోకి నోకియా కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవే!

నోకియా 5.4, నోకియా 3.4 పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్ రెండు సరికొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటితో పాటు నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్ లైట్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో నోకియా 5.4 మోడల్‌ మధ్యశ్రేణి, నోకియా 3.4 మోడల్‌ బడ్జెట్ శ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా తీసుకొచ్చారు. మరి వీటి ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

నోకియా 5.4 ఫీచర్లు..

nokia 5.4 phone
నోకియా 5.4
  • ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది.
  • దీన్ని ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో అప్‌డేట్ చేసుకోవచ్చు.
  • ఇందులో 6.39-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు.
  • క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ ఉపయోగించారు.
  • మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక వైపు గుండ్రటి డయల్ ఆకృతితో నాలుగు, ముందు పంచ్ హోల్ కటౌట్‌తో సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు.
  • వెనక 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
  • 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ వేరియంట్ ధర రూ. 13,999, 6జీబీ ర్యామ్‌/64జీబీ ధర రూ. 15,499. డస్క్‌, పోలార్ నైట్ రంగుల్లో లభిస్తుంది.
  • ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, నోకియా ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చెయ్చొచ్చు.

నోకియా 3.4 ఫీచర్లు..

nokia 3.4 features
నోకియా 3.4
  • ఇందులో 6.39-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు.
  • క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉపయోగించారు.
  • ఆండ్రాయిడ్ 10ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11కి అప్‌డేట్ అవుతుంది.
  • మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. వెనక మూడు, ముందు ఒకటి ఉన్నాయి.
  • వెనక వైపు 13ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు.
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5వాట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ వేరియంట్ ధర రూ. 11,999.
  • చార్‌కోల్, డస్క్‌, ఫ్జోర్డ్‌ రంగుల్లో లభిస్తుంది.
  • ఫిబ్రవరి 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఇండియా వెబ్‌సైట్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

నోకియా పవర్‌బడ్స్‌ లైట్ ఫీచర్లు

nokia earbuds
నోకియా పవర్‌బడ్స్‌ లైట్

నోకియా పవర్‌బడ్స్‌ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి ఐపీఎక్స్‌7 రేటింట్ ఇచ్చారు. దీని వల్ల ఒక మీటరు లోతు నీటిలో అరగంట సేపు తడిచినా ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుంది. స్నో, చార్‌కోల్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ. 3,599.

ఇదీ చదవండి:ట్విట్టర్‌కు పోటీగా 'కూ'తకొచ్చింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.