ETV Bharat / business

టీకా​ వార్తలు, క్యూ3 లెక్కలే మార్కెట్లకు కీలకం!

author img

By

Published : Jan 3, 2021, 12:39 PM IST

Stock Market Outlook
ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంచనాలు

కరోనా వ్యాక్సిన్ అప్​డేట్లు, డిసెంబర్​కు సంబంధించిన స్థూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల క్యూ3 ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు కేంద్ర బడ్జెట్ వార్తలు, అమెరికా రాజకీయ పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.

స్టాక్ మార్కెట్లకు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కరోనా వ్యాక్సినేషన్​ వార్తలు, కార్పొరేట్ల మూడో త్రైమాసిక ఫలితాలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఐటీ దిగ్గజం టీసీఎస్​తో క్యూ3 ఫలితాల సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నెల 8న టీసీఎస్ 2020-21 క్యూ3​ ఫలితాలు ప్రకటించనుంది. ఈ వారమే తయారీ, సేవా రంగ పీఎంఐ గణాంకాలూ విడుదల కానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సూచీలు గత వారం రికార్డు స్థాయిల వద్ద ముగిసిన నేపథ్యంలో మదుపరులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

'కరోనా వ్యాక్సిన్​కు అనుమతులు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వార్తలు గత వారం వరకు మార్కెట్ల భారీ లాభాలకు దన్నుగా నిలిచాయి. అయితే కంపెనీల క్యూ3 ఫలితాల సీజన్​, కేంద్ర బడ్జెట్​ వార్తలూ ఇకముందు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి' అని మోతీలాల్​ ఓస్వాల్ ఫినాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్​ పరిశోధన విభాగాధిపతి సిద్ధార్థ్​ ఖింకా పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఏప్రిల్‌ నాటికి దేశంలో 'స్పుత్నిక్‌ వి' టీకా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.