ETV Bharat / business

జులైలో 36% తగ్గిన వాహన విక్రయాలు

author img

By

Published : Aug 11, 2020, 1:20 PM IST

వాహన రంగంపై కరోనా ప్రభావం ఇంకా తగ్గడం లేదు. అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభమైనా.. జులైలోనూ వాహనాల రిటైల్ విక్రయాలు (అన్ని విభాగాల్లో కలిపి) 36.27 శాతం తగ్గాయి. గత నెల 11,42,633 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.

fada on Auto sales
జులైలో వాహన విక్రయాలు

ప్రయాణికుల వాహనాల(పీవీ) విక్రయాలపై కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. జులైలోనూ పీవీల రిటైల్ విక్రయాలు 25 శాతం తగ్గి.. 1,57,373 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019లో 2,10,377 ప్యాసింజర్​ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన డీలర్ల సంఘం-ఫాడా తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

అన్ని విభాగాల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 36.17 శాతం తగ్గి.. 11,42,633 యూనిట్లకు పడిపోయాయి. 2019 జులైలో ఈ సంఖ్య 17,92,879 లక్షలుగా ఉండటం గమనార్హం.

జులైలో విక్రయాలు ఇలా..

వాహన రకం 2020లో2019లోక్షీణత
ద్విచక్ర వాహనాలు8,74,638 13,98,702 37%
వాణిజ్య వాహనాలు 19,293 69,33872.18%
త్రిచక్ర వాహనాలు 15,132 58,940 74.33%

ఫాడా తెలిపిన మరిన్ని వివరాలు..

  • ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా 50.4 శాతం వాటాతో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది.
  • ద్విచక్ర వాహన విభాగంలో 40.66 శాతం మార్కెట్ వాటాతో హీరో తొలి స్థానంలో నిలిచింది.
  • వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా 46.29 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో ఉంది.
  • గత ఏడాదితో పోలిస్తే వాహన రిజిస్ట్రేషన్​లు జులైలో భారీగా తగ్గాయి. ఈ ఏడాది జూన్​తో పోలిస్తే మాత్రం.. రిజిస్ట్రేషన్​లు కాస్త మెరుగయ్యాయి.

ఇదీ చూడండి:బిలియనీర్ల జాబితాలో తొలిసారి టిమ్​ కుక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.