ETV Bharat / business

బడ్జెట్​కు ముందు కేంద్ర ఆర్థికశాఖ 'హల్వా' వేడుక

author img

By

Published : Jan 23, 2021, 4:26 PM IST

Updated : Jan 23, 2021, 7:26 PM IST

halwa party  started before budget of 2021
బడ్జెట్​కు ముందు కేంద్ర ఆర్థికశాఖ 'హల్వా' వేడుక

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతీ ఏటా నిర్వహించే హల్వా వేడుక శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ లో జరిగింది. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్​, సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​, శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది.

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందుగా.. ప్రతీ ఏటా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించే హల్వా వేడుక శనివారం మధ్యాహ్నం జరిగింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

బడ్జెట్​కు ముందు కేంద్ర ఆర్థికశాఖ 'హల్వా' వేడుక

కరోనా కారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణకు కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో 100 మంది బడ్జెట్ ప్రెస్ లో ఉండేవారు.

శనివారం నుంచి పత్రాల ముద్రణలో ఉండే బడ్జెట్ డివిజన్, సీబీడీటీ, సీబీఐసీ, ఆర్థిక శాఖ ఉద్యోగులు నార్త్ బ్లాక్ లోని మంత్రిత్వ శాఖ బేస్మేంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉంటారని తెలిపింది. కరోనా కారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణకు కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రెస్ లో ఉండే వారు.. కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి లేదని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం మొదటిసారి బడ్జెట్ పత్రాల ముద్రణ ఉండదని అధికారులు తెలిపారు. బడ్జెట్ పత్రాలన్నీ ఆన్లైన్ లో అప్‌లోడ్ చేయనున్నట్లు వెల్లడించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం బడ్జెట్ ముద్రణ లేకుండా ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారిగా నిలవనుంది. ఈ ఏడాదికి బడ్జెట్ సాఫ్ట్ కాపీలు మాత్రమే అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.

బడ్జెట్​కోసం కొత్తయాప్​..

హల్వా వేడుక సందర్భంగా 'యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌'ను నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. పార్లమెంట్‌ సభ్యులతో పాటు, సాధారణ ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా మొబైల్‌లో బడ్జెట్‌ను వీక్షించొచ్చు. బడ్జెట్‌ ప్రసంగం పూర్తైన తర్వాత ఆ ప్రతులు యాప్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో బడ్జెట్‌ ప్రతులను చదువుకోవచ్చు. వాటిని డౌన్‌లోడ్‌ చేయడంతో పాటు ప్రింట్‌ చేసుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. గత బడ్జెట్‌ ప్రతులనూ ఈ యాప్‌లో పొందొచ్చు. అలాగే www.indiabudget.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా బడ్జెట్‌ ప్రతులను పొందొచ్చు.

halwa party  started before budget of 2021
బడ్జెట్​కోసం కొత్తయాప్​..

ఇదీ చూడండి: కొత్త బడ్జెట్​లో ఆ ఊరట లభిస్తుందా?

Last Updated :Jan 23, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.