ETV Bharat / business

ఏంటీ.. గూచీ కుర్తా ధర రూ. 2.5లక్షలా!

author img

By

Published : Jun 4, 2021, 12:54 PM IST

సాధారణంగా కుర్తా ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ.వేలల్లో ఉంటుంది. కానీ ప్రముఖ ఇంటర్నేషన్ బ్రాండ్ గూచీ.. ఓ ఎంబ్రాయిడరీ కుర్తా ధరను రూ. 2.5లక్షలుగా నిర్ణయించి ఆన్​లైన్​లో విక్రయిస్తోంది. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన ఓ​ నెటిజన్​.. ఈ విషయాన్ని ట్విట్టర్​లో షేర్ చేశాడు. ఈ పోస్టుకు వచ్చిన ఫన్నీ కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడమే కాక, నవ్వులు పూయిస్తున్నాయి. అవెేంటో మీరు చూసేయండి.

Gucci is selling a kurta for Rs 2.5 lakh. netizens reactions gone viral
గూచీ కుర్తా ధర రూ.2.5లక్షలు

ప్రముఖ ఇంటర్నేషల్ బ్రాండ్ గూచీ.. ఓ ఎంబ్రాయిడరీ కుర్తాను రూ.2.5లక్షలకు విక్రయిస్తోందని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఈ ధర చూసి అందరూ షాక్​ అవుతున్నారు. ఓ నెటిజన్​.. ట్విట్టర్​లో కుర్తా వివరాలను షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు ఫన్నీ, సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్​​ అయి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

Gucci is selling a kurta for Rs 2.5 lakh. netizens reactions gone viral
గూచీ కుర్తా ధర రూ.2.5లక్షలు

"ఓ భారతీయ కుర్తాను గూచీ రూ.2.5లక్షలకు విక్రయిస్తోంది. ఇలాంటి కుర్తాను నేను బయట మార్కెట్లో రూ.500కే కొనగలను," అని మొదట ఓ ట్విట్టర్ యూజర్​ గూచీ వెబ్​సైట్లో కుర్తా ధరను స్క్రీన్ షాట్ తీసి షేర్​ చేశాడు. ఈ కుర్తా డిస్క్రిప్షన్​ 'యాన్ ఎంబ్రాయిడర్​ ఆర్గానిక్ లినెన్​ కాఫ్టాన్ అని' వెబ్​సైట్లో ఉంది.

Gucci is selling a kurta for Rs 2.5 lakh. netizens reactions gone viral
వైరల్​: రూ.లక్షల్లో గూచీ కుర్తా ధర- నెటిజన్ల ఫన్నీ కామెంట్స్​

ఈ పోస్టుకు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లు...

ఈ కుర్తా మార్కెట్లో రూ. 1000కే దొరుకుతుంది. -ట్విట్టర్ యూజర్​​

ఈ కుర్తారు నేనైతే రూ.150కి మించి ఒక్క పైసా ఎక్కువ ఇవ్వను. -ట్విట్టర్ యూజర్​​

దీనిపై అభ్యంతరం లేదు. కానీ ఈ కుర్తాను రూ.500కి ఇచ్చినా నేను కొనను. -ట్విట్టర్ యూజర్​​

సరోజినీ నగర్​లో ఈ కుర్తా రూ.250కే దొరుకుతుంది- ట్విట్టర్ యూజర్​​

దీనికి అంత ధర పెట్టే బదులు ఎంచక్కా అక్కడి వారు భారత్​కు వచ్చి కొనుక్కొని వెళ్లొచ్చు. -ట్విట్టర్ యూజర్

ఇది కుర్తా.. కాఫ్టాన్​ కాదు. రూ.500 పెడితే ఇలాంటి కుర్తాలు రెండొస్తాయి. ఇది బ్రాండ్ అని తెలుసు, కానీ ఇంత ధర ఆమోదయోగ్యం కాదు. -ట్విట్టర్ యూజర్​​

ఈ కుర్తాకు రూ.500 పెట్టినా ఎక్కువే. సరోజినీ మార్కెట్లో రూ.250కే దొరుకుతుంది. బేరమాడితే రూ.200కే వస్తుంది. -ట్విట్టర్ యూజర్

మా అమ్మ ఇలాంటి కుర్తాను రూ.100కే కుడుతుంది. -ట్విట్టర్ యూజర్

ఇంతకంటే మంచి డిజైన్లు చోర్​ బజార్లో దొరుకుతాయ్​. -ట్విట్టర్ యూజర్

సేమ్​ డిజైన్ సరోజినీ​ మార్కెట్లో రూ.400కే తీసుకున్నా. -ట్విట్టర్ యూజర్

మా ఆంటీ ఇంతకన్నా మంచి కుర్తాను రూ.800కే కుడుతుంది. -ట్విట్టర్ యూజర్

Gucci is selling a kurta for Rs 2.5 lakh. netizens reactions gone viral
వైరల్​: రూ.లక్షల్లో గూచీ కుర్తా ధర- నెటిజన్ల ఫన్నీ కామెంట్స్​
Gucci is selling a kurta for Rs 2.5 lakh. netizens reactions gone viral
వైరల్​: రూ.లక్షల్లో గూచీ కుర్తా ధర- నెటిజన్ల ఫన్నీ కామెంట్స్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.