ETV Bharat / business

GST council meeting: జీఎస్​టీ మండలి భేటీ- అజెండాలో 'పెట్రోల్​, డీజిల్​'

author img

By

Published : Sep 17, 2021, 12:16 PM IST

Updated : Sep 17, 2021, 1:34 PM IST

లఖ్​నవూ వేదికగా జీఎస్​టీ మండలి(GST council meeting) సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman news)​ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి (petrol GST) తెచ్చే అంశంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

GST council meet
జీఎస్​టీ మండలి భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman news)​ అధ్యక్షతన జీఎస్​టీ మండలి (GST council meeting) సమావేశమైంది. ఇది 45వ సమీక్షా సమావేశం. దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా ఈ భేటీ జరుగుతుండటం విశేషం. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా మండలి సమావేశాలన్నీ(GST council meeting) వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే జరిగాయి. లఖ్​నవూ వేదికగా జరుగుతున్న ఈ భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

GST council meeting Chaired by Sitaraman
నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన జీఎస్​టీ మండలి భేటీ

భేటీలో చర్చాంశాలు..

ప్రస్తుత భేటీలో జీఎస్​టీ మండలి (GST council meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి (petrol GST) తీసుకురావాలన్న డిమాండ్​ను.. మండలి ఈ సమావేశంలో పరిశీలించే అవకాశాలున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సేవలను కూడా జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Harish Rao at GST council meet
జీఎస్​టీ మండలి భేటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు

వీటితో పాటు 48 రకాల వస్తువులపై పన్ను రేట్లను సమీక్షించడం.. 11 రకాల కొవిడ్ అత్యవసరాలపై జీఎస్​టీ మినహాయింపు గడువు పెంపుపై నిర్ణయం తీసుకోనుంది మండలి. ఈ గడువు 2021 వరకు పెంచే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు!

Last Updated :Sep 17, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.