ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Dec 30, 2019, 5:03 PM IST

Gold prices fall Rs 73; silver drops Rs 156
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

సంవత్సరాంతం సెలవులు కావడం వల్ల ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.73 తగ్గి రూ.39,882గా ఉంది. కిలో వెండి ధర రూ.156 తగ్గి రూ.47,910గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.73 తగ్గి రూ.39,882గా ఉంది. కిలో వెండి ధర రూ.156 తగ్గి రూ.47,910గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్​ బంగారం 1,513.50 డాలర్లు, ఔన్స్​ వెండి ధర రూ.17.87 డాలర్లుగా ట్రేడయ్యాయి.

ధరలు పెరుగుతూనే ఉంటాయ్​..

ఈరోజు స్వల్పంగా తగ్గినా... రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"అమెరికా, పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్త పడుతున్నారు. నష్టభయం లేకుండా ఉండేందుకు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి." - నవనీత్​ దమాని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్​ ఉపాధ్యక్షుడు (కమొడిటీస్ రీసెర్చ్​)

ఇదీ చూడండి: ఆద్యంతం ఊగిసలాడి ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

New Delhi, Dec 30 (ANI): In an interaction with ANI, political strategist Prashant Kishor said that National Register of Citizens (NRC) is a subset of National Population Register (NPR). He said, "Nobody needs to prove link between NPR and NRC, documents speak for themselves and they state that NPR is the first step of NRC. This debate is linked to Citizenship Amendment Bill of 2003 during which, it was defined that after NPR, if government wishes, they can do NRC. NRC is a subset of NPR. And the implementation is up to the government and it is a different thing."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.