ETV Bharat / business

Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Nov 9, 2021, 10:00 AM IST

Gold price today
బంగారం, వెండి ధఱలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.130 తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి ధర కిలోకు రూ.53 తగ్గింది.

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.130 తగ్గగా.. కిలో వెండి ధర రూ.53 దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,530గా ఉంది. కిలో వెండి ధర రూ.66,433 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,530కి, కేజీ వెండి ధర రూ.66,433కి చేరింది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,530గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,433కి పెరిగింది.

అంతర్జాతీయంగా..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1823.90 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.39 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

పెట్రోల్​, డీజిల్ ధరల్లో మంగళవారం ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇదీ చూడండి: సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే- గాడిన పడేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.