ETV Bharat / business

అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్లకు కీలకం!

author img

By

Published : Dec 27, 2020, 12:39 PM IST

స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా ముందుకు నడిపించనున్నాయి. దేశీయంగా ఈ వారంలో చెప్పుకోదగ్గ ఆర్థిక అంశాలు లేనందున.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త రకం విజృంభణ, ఐరోపా సమాఖ్యతో బ్రిటన్​ వాణిజ్య ఒప్పందం వంటి వాటిపై మదుపరులు దృష్టి సారించే వీలుంది.

stocks this week
ఈ వారం స్టాక్ మార్కెట్​ అంచనాలు

దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వైరస్ కొత్త రకం ప్రభావం, వ్యాక్సిన్​ వార్తలు ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ నెల డెరివేటివ్స్​ ముగియనున్న నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని అంటున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలు లేనందున.. ఈ వారానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకంగా మానున్నట్లు అభిప్రాయడుతున్నారు.

అంతర్జాతీయంగా.. కరోనా వ్యాక్సిన్​ వార్తలు, బ్రెగ్జిట్ ఒప్పందం వంటివి మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తుది గడువులోపే ఐరోపా సమాఖ్యతో బ్రిటన్​ చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడం కూడా కలిసొచ్చే అంశమంటున్నారు.

కరోనా కొత్త రకం విజృంభణ భయాల నేపథ్యంలో మదుపరులు క్వాలిటీ సెక్టార్​లపై దృష్టి సారించే వీలుందని మార్కెట్​ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కుడా వీరి సెంటిమెంట్​ను ప్రభావితం చేసే అంశమని చెబుతున్నారు.

వీటితో పాటు.. రూపాయి, ముడి చమురు కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:కిరాణా కొట్లు.. ఐటీకి మెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.