ETV Bharat / business

AMARA RAJA: అమరరాజా బ్యాటరీస్​ నూతన ఛైర్మన్​గా ఎంపీ గల్లా జయదేవ్

author img

By

Published : Jun 14, 2021, 10:32 PM IST

దిగ్గజ బ్యాటరీ తయారీదార్ల సంస్థ అమరరాజా(AMARA RAJA) ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తదుపరి ఛైర్మన్​గా ఎంపీ గల్లా జయదేవ్(MP GALLA JAYADEV)​ బాధ్యతలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. రానున్న కాలంలో వస్తున్న వ్యాపార అవకాశాలను అందింపుచ్చుకునేందుకు వీలుగా సంస్థ కొత్త పెట్టుబడులతో ముందుకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

mp galla jayadev as new chairman of amararaja batteries
అమరరాజా బ్యాటరీస్​ నూతన ఛైర్మన్​గా ఎంపీ గల్లా జయదేవ్

దేశంలోని ప్రముఖ బ్యాటరీ తయారీదార్ల సంస్థ అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా రామచంద్రనాయుడు ప్రకటించారు. ఏపీ తిరుపతిలోని అమరరాజా కార్యాలయంలో వర్చువల్​గా జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఛైర్మన్​గా ఎంపీ గల్లా జయదేవ్​ను(MP GALLA JAYADEV) ఆగస్టులో జరిగే బోర్డు సమావేశంలో ఎన్నుకోనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

ప్రస్తుతం నాన్​ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా కొనసాగుతున్న డాక్టర్ రమా గౌరినేని బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆమె కుమారులు హర్షవర్ధన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేనిలు నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమరరాజా(AMARA RAJA) యాజమాన్యం ప్రకటించింది. సంస్థ పురోభివృద్ధి దృష్ట్యా లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల అమలు విషయంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమరరాజా నిర్ణయించింది. దీని ద్యారా ఎనర్జీ, మొబిలిటీ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్​ను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి: CS Somesh: 'గజ్వేల్​ మార్కెట్ అద్భుతం... తెలంగాణలో మరిన్ని నిర్మిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.