ETV Bharat / business

తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో 'శాంసంగ్'​ కొత్త ఫోన్

author img

By

Published : Jan 9, 2021, 8:30 PM IST

Updated : Jan 9, 2021, 9:40 PM IST

Tech-Gadget- Samsung Max Up' Galaxy M02s

ప్రముఖ ఎలక్ట్రానిక్​ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ సిరీస్​లో మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఆధునిక హంగులతో విడుదలైన ఈ ఫోన్​ ధర రూ.10 వేలలోపే ఉండటం విశేషం. మరి ఈ ఫోన్​ ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​ మరో కొత్త ఫోన్​ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ఎం​ సిరీస్​లో భాగంగా.. 'మ్యాక్స్​ అప్​ గెలాక్సీ ఎం02' పేరుతో ఈ ఫోన్​ను విడుదల చేసింది. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యంతో రూ.10,000 లోపు శాంసంగ్​ తీసుకువచ్చిన మొదటి ఫోన్​ ఇదే.

'మ్యాక్స్​ అప్​ గెలాక్సీ ఎం02​' ఫీచర్లు..

  • 6.5 అంగుళాల, హెచ్​డీ ప్లస్​ తెర
  • 1టీబీ వరకు మెమొరీ సామర్థ్యం
  • క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 450​ ప్రాసెసర్​, 4జీబీ ర్యామ్​
  • 5,000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ, 15వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​
  • 13 ఎంపీ మెయిన్​ కెమెరా, 2ఎంపీ రిఫైన్​డ్​ మ్యాక్రో లెన్స్​. (ట్రిపుల్​ రేర్​ కెమెరా)
  • 5ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ధర రూ.8,999(3జీబీ+32జీబీ) రూ.9,999(4జీబీ+64జీబీ)
  • రంగులు- నలుపు, నీలం, ఎరుపు
    Tech-Gadget- Samsung Max Up' Galaxy M02s
    'మ్యాక్స్​ అప్​ గెలాక్సీ ఎం02​ ఎం02' ఫీచర్లు..

'డిజిటల్​ ఇండియా' ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఫోన్​ను విడుదల చేసినట్లు శాంసంగ్​ ఇండియా తెలిపింది.

ఇదీ చూడండి:ఐఫోన్‌ వర్సెస్​ ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు?

Last Updated :Jan 9, 2021, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.