ETV Bharat / business

చెప్పులేసుకుంటే చాలు.. రూ.లక్షల్లో జీతం!

author img

By

Published : Jan 31, 2021, 1:49 PM IST

చెప్పులు వేసుకుంటే లక్షల రూపాయల్లో వేతనం అందిస్తామంటోంది ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థ. తాము తయారు చేసిన చెప్పులు ఎలా ఉన్నాయో అనుభవపూర్వకంగా పరిశీలించి ఓ నివేదిక ఇస్తే చాలంటోంది. జనవరి 31తో గడువు ముగుస్తోంది. మరి త్వరపడండి.

Company giving four Lakh rupees salary for testing Slippers
చెప్పులేసుకుంటే.. రూ.లక్షల్లో జీతం!

కరోనా కారణంగా.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గడపదాటి బయటకు రాలేదు. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే చెప్పుల కన్నా.. ఇంట్లో వేసుకునే చెప్పులే అరిగిపోయి ఉంటాయి. సోఫా షీట్లు, బెడ్‌ షీట్లు మాసిపోయి, హోమ్‌వేర్‌ దుస్తులు పాతబడిపోయి ఉంటాయి. వీటిని మారుస్తూ.. నచ్చినట్లు సొంతంగా డిజైన్‌ చేసే ఉంటారు. అలాంటి అనుభవం మీకు ఉన్నట్లయితే 'బెడ్‌రూం అథ్లెటిక్స్‌' కంపెనీ ఒక ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తోంది. నెలలో కేవలం రెండు రోజులు పనిచేస్తే చాలు.. ఏడాదికి రూ.4 లక్షల జీతం ఇస్తామంటోంది.

జనవరి 31 చివరి తేదీ..

యూకేకు చెందిన 'బెడ్‌రూం అథ్లెటిక్స్‌' అనే సంస్థ ఇంట్లో వేసుకునే కంఫర్ట్‌ చెప్పులు, సోఫా షీట్లు, బెడ్‌షీట్లు, డోర్‌మ్యాట్లు తయారు చేస్తుంటుంది. కొత్త ఏడాదిలో 'స్లిప్పర్‌ టెస్టర్‌'ను నియమించుకోవాలని నిర్ణయించింది. రెండు పోస్టులు ఉండగా.. ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు కేటాయించింది. సంస్థ తయారు చేసే చెప్పులు, ఇతర ఉత్పత్తులను ఎంపికైన ఉద్యోగులు వినియోగించి, పరిశీలించి ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఉద్యోగి చేయాల్సిన పని. నెలలో రెండు రోజులు మాత్రమే ఈ పని ఉంటుంది. ఇందుకు గానూ సంస్థ ఏడాదికి రూ.4 లక్షలు జీతంగా ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31లోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కోరుతోంది.

ఇదీ చదవండి: లోగో మార్చిన మింత్రా.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.