ETV Bharat / business

ప్రధాన ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్​

author img

By

Published : Jan 28, 2022, 7:09 PM IST

Updated : Jan 28, 2022, 9:47 PM IST

Chief Economic Advisor: ప్రధాన ఆర్థిక సలహాదారుగా డాక్టర్​ వీ అనంత నాగేశ్వరన్​ నియామకమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేవీ సుబ్రమణియన్​ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.

Chief Economic Advisor
అనంత నాగేశ్వరన్

Chief Economic Advisor: బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) డాక్టర్​ వీ అనంత నాగేశ్వరన్​ నియామకమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

డాక్టర్​ నాగేశ్వరన్​.. ఒక రచయిత, టీచర్​, కన్సల్టెంట్​ సహా క్రెడిట్ సూయిస్ గ్రూప్‌ ఏజీగా, జూలియస్ బేర్‌ గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించినట్లు పేర్కొంది ఆర్థిక శాఖ. ఆయన భారత్​తో పాటు సింగపూర్​లోని పలు బిజినెస్​ స్కూల్స్​, మేనేజ్​మెంట్​ ఇన్​స్టిట్యూట్లలో పనిచేసినట్లు తెలిపింది.

ప్రధాన ఆర్థిక సలహాదారులగా పని చేసిన కృష్ణమూర్తి సుబ్రమణియన్​ పదవీకాలం గతేడాది డిసెంబరులోనే ముగిసింది. ఈ క్రమంలో.. 2021, అక్టోబర్​ 9న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాగేశ్వరన్​ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

ఇక బడ్జెట్‌ తయారీ పనుల్లో నిమగ్నమైన కేంద్రం.. అందులో పాల్గొనే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్‌ బ్లాక్‌లోని లాక్‌ఇన్‌లోకి గురువారమే పంపించింది. తక్షణమే నాగేశ్వరన్​ బాధ్యతల్లో చేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ప్రధాన ఆర్థిక సలహాదారుగా వైదొలిగిన కేవీ సుబ్రమణియన్‌

Last Updated : Jan 28, 2022, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.