ETV Bharat / business

అమెజాన్​కు రూ.202 కోట్ల ఫైన్​- 'ఫ్యూచర్ డీల్'​ అనుమతులు రద్దు

author img

By

Published : Dec 17, 2021, 6:34 PM IST

Updated : Dec 17, 2021, 7:04 PM IST

penalty on Amazon
అమెజాన్​కు ఫైన్

CCI Penalty On Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ సంస్థకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రూ.202 కోట్ల జరిమానా విధించింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

CCI Penalty On Amazon: అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​, కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూపు​ మధ్య పెట్టుబడులకు సంబంధించిన వివాదం మరో మలుపు తిరిగింది. ఫ్యూచర్ గ్రూపుతో అమెజాన్​ ఒప్పందానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తెలిపింది. ఒప్పందం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం సహా ఇతర విషయాలను దాచిపెట్టినందుకుగాను అమెజాన్​కు రూ.202 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.

సీసీఐ తన 57 పేజీల ఉత్తర్వుల్లో అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు మధ్య ఒప్పందానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా పూర్తి వివరాలతో ఫామ్​ 2ను దాఖలు చేయాలని అమెజాన్​ సంస్థను ఆదేశించింది.

Amazon Future Deal: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌ మధ్య కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందంపై అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తోంది. 2019 నాటి ఈ పెట్టుబడుల ఒప్పందాన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఉల్లంఘించిందనేది అమెజాన్​ సంస్థ ఆరోపణ.

ఇదీ చూడండి: పన్ను భారం తగ్గించుకోండిలా.. చివరి వరకు వేచి చూడొద్దు...

ఇదీ చూడండి: Mutual Fund Investment: ఆ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా?

Last Updated :Dec 17, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.