ETV Bharat / business

ఆ ఆఫీసులో వారానికి మూడురోజులే పని!

author img

By

Published : Oct 6, 2021, 9:37 AM IST

ఎప్పుడూ వృత్తిగత జీవితమే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలంటున్నాడు ఓ స్టార్టప్​ కంపెనీ యజమాని. అందుకే తమ కంపెనీలో ఉద్యోగులు వారానికి మూడే రోజులే పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే చిన్న షరతు పెడుతున్నారు.

3 days working
వారానికి మూడురోజులే పని

వారానికి ఒక్క రోజు వచ్చే సెలవు కోసం ఆరు రోజులు ఎదురుచూస్తాం. వారంలో రెండ్రోజులు సెలవులుండే ఉద్యోగులను చూసి మనం అసూయ వ్యక్తంచేస్తుంటాం. మరి ఏడు రోజుల్లో మూడే రోజులు పని చేస్తే చాలనే యజమానులను 'మీరు దేవుళ్లు' అనకుండా ఉండలేం. బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ అదే చేయమంటోంది. కాకపోతే జీతం మాత్రం 80 శాతమే ఇస్తామని చిన్న షరతు పెడుతోంది. ప్రతిభ, నైపుణ్యం ఉన్నవాళ్లను ఆకట్టుకోవడానికే ఈ నిబంధన తీసుకొచ్చామంటోంది 'స్లైస్‌'.

ఎక్కువ పని గంటలు చేయడం ఇష్టం లేనివాళ్లకు ఈ నిబంధన ఉపయుక్తంగా ఉంటుందంటోంది. 'ఇది కంపెనీ, ఉద్యోగులిద్దరికీ విన్‌ విన్‌ పరిస్థితిలా ఉంటుంది. మూడురోజులు పని చేసుకొని మిగతా నాలుగురోజులు ఎంచక్కా తమ ఆసక్తులు, ఇష్టాలను నెరవేర్చుకోవచ్చు. సరదాలు తీర్చుకోవచ్చు' అంటున్నారు కంపెనీ వ్యవస్థాపకుడు రాజన్‌ బజాజ్‌. 28 ఏళ్ల బజాజ్‌కి యువ ఉద్యోగుల సరదాలు, ఇష్టాలు బాగా తెలుసు. అందుకే తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చాడు. 'ఉద్యోగం అంటే తాళికట్టిన భార్య కాదు.. ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండటం చాలామందికి నచ్చదు. వృత్తిగత జీవితమే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేయడం ఈతరం ఉద్యోగుల నైజం. రాబోయే రోజుల్లో ఈ తరహా ఉద్యోగాల ట్రెండ్‌ పెరిగిపోవడం ఖాయం' అంటాడు తను.

ఇదీ చూడండి: పాత వాహనాలపై ఛార్జీలు 8 రెట్లు పెంచిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.