ETV Bharat / briefs

కానిస్టేబుల్ తుది కీ విడుదల చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ

author img

By

Published : May 4, 2019, 6:09 AM IST

కానిస్టేబుల్ తుది పరీక్ష కీ పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఈనెల 6 లోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కీ విడుదల చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష తుది కీ విడుదలైంది. అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈనెల 6 లోపు తెలపాల్సి ఉంటుంది. గత నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే! శుక్రవారం నుంచి కీ అందుబాటులోకి వచ్చిందని, ఏవైనా అభ్యంతరాలుంటే మండలి వెబ్​సైట్ ద్వారా తమకు తెలపాలని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తప్పని భావించిన ప్రతీ ప్రశ్నను వేర్వేరుగా సమర్పించాలని... ఇందుకోసం వెబ్​సైట్లో ప్రత్యేకంగా ఒక ఫార్మాట్ అందుబాటులో ఉంచామని తెలిపారు. అసమగ్రంగా ఉండే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని వెల్లడించారు.

కీ విడుదల చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ

ఇవీ చూడండి: 'సిద్దిపేటను సమగ్ర అభివృద్ధి చేస్తాం : హరీశ్​రావు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.