ETV Bharat / bharat

దుస్తులు విప్పి కర్రలు, పైపులతో దాడి.. దళితుడితో చెప్పులు నాకించిన​ ఉద్యోగి

author img

By

Published : Jul 9, 2023, 4:30 PM IST

Updated : Jul 9, 2023, 5:55 PM IST

Man Attacked By Mob : దొంగతనం నెపంతో ఓ వ్యక్తి దుస్తులు విప్పి దారుణంగా కొట్టారు కొందరు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఓ దళిత వ్యక్తిని చెప్పులు నాకించాడు ఓ విద్యుత్​ ఉద్యోగి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. కర్ణాటకలో జరిగిన ఘటనలో ఓ కిరాణా షాపు యజమాని.. తన వద్ద పనిచేసే కూలీకి నిప్పంటించి హత్య చేశాడు.

Man Attacked By Mob
Man Attacked By Mob

Man Attacked By Mob : దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తి దుస్తులు విప్పి.. కర్రలు, పైపులతో విచక్షణ రహితంగా దాడి చేశారు కొందరు దుండగులు. మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై స్పందించిన ఎస్​పీ అభిషేక్​ తివారీ.. మోతీనగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ధరమ్​కాంట ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేశామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జి మానస్​ ద్వివేది చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

కర్రలు, పైపులతో వ్యక్తిపై దాడి.. దొంగతనం నెపంతో దుస్తులు విప్పి..

దళితుడితో చెప్పులు నాకించిన వ్యక్తి..
Dalit Man Assaulted : విద్యుత్​ శాఖలో కాంట్రాక్ట్​ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ఒక దళితుడిపై దాడి చేశాడు. అనంతరం తన చెప్పులు నాకించుకుని పాశవికంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అధికారులు విధుల నుంచి తొలగించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్ర జిల్లాలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 6వ తేదీన బాధితుడు రాజేంద్ర చమర్ తన మేనమామ ఇంటికి వెళ్లాడు. అక్కడి విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. సమస్యను గుర్తించడానికి రాజేంద్ర ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్​ శాఖలో కాంట్రాక్ట్​ ఉద్యోగిగా పనిచేస్తున్న తేజ్​బాలీ సింగ్​ పటేల్​ అనే వ్యక్తి.. రాజేంద్రను పరుష పదజాలంతో దూషించాడు. అనంతరం తన చెప్పులను నాకించుకున్నాడు నిందితుడు.

ఆ తర్వాత అతడి చేయిని మెలితిప్పి.. నేలపైకి తోసేశాడు. ఛాతీపై ఎక్కి కొట్టాడు. ఈ క్రమంలో స్థానికులు జోక్యం చేసుకుని బాధితుడిని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. జులై 8న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. అతడిని ఉద్యోగం నుంచి తీసేశారని వెల్లడించారు.

ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ డీజీపీ స్పందించారు. 'ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. డీఐజీని సంఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆదేశించాను. నిందితుడిపై ఎస్​సీ, ఎస్​టీ చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి అరెస్టు చేశాము. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.' అని ఆదివారం రాత్రి డీజీపీ ట్వీట్​ చేశారు.

  • DGP UP has taken cognizance of the incident and directed the DIG range to visit the scene of the crime. An FIR has been registered under the SC/ST Act, and the accused has been promptly arrested. The DGP has given directions for the strictest legal action against the accused. https://t.co/c0dsYdszhe

    — UP POLICE (@Uppolice) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం సృష్టించింది. అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. మధ్యప్రదేశ్​లో ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన కంటే.. ఇది సిగ్గుచేటు అని సమాజ్​ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దళితులను మనుషులుగా కూడా పరిగణించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్​ హేయమైన చర్యగా అభివర్ణించింది. బీజేపీ దళితులను అవమానించిందని రాష్ట్రీయ లోక్​ దళ్ ఆరోపించింది.

కూలీకి నిప్పంటించి యజమాని హత్య..
ఓ కిరాణా దుకాణం యజమాని.. తన వద్ద పనిచేసే కూలీకి నిప్పంటించి హత్య చేశాడు. అనంతరం కరెంట్​ షాక్​ తగిలి మృతిచెందినట్లుగా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరు సౌత్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తౌసిఫ్​ హుస్సేన్ (32) అనే వ్యక్తి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద గజానన అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో గజాననకు నిప్పంటించి హత్య చేశాడు తౌసిఫ్​. అనతంరం బాధితుడు కరెంట్​ షాక్​తో చనిపోయినట్లు చిత్రీకరించి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణ ప్రకారం హత్యగా నిర్ధరించి.. శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.

Last Updated :Jul 9, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.