ETV Bharat / bharat

మాంసాహార పిజ్జా డెలివరీ.. రూ.కోటి చెల్లించాలని కేసు!

author img

By

Published : Mar 14, 2021, 7:21 AM IST

పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్​ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారని ఓ అమెరికన్ రెస్టారెంట్​ ఔట్​లెట్​పై ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ కేసు వేసింది! ఆ పిజ్జాతో తమ మతపర మనోభావాలు దెబ్బతిన్నందున రూ.కోటి పరిహారం చెల్లించాలని తన ఫిర్యాదులో పేర్కొంది.

non veg pizza delivered case
మాంసాహార పిజ్జా డెలివరీ.. రూ.కోటి చెల్లించాలని కేసు!

పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్​ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసిన అమెరికన్​ రెస్టారెంట్ ఔట్​లెట్​పై.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ కోటి రూపాయల పరిహారానికి కేసు వేసింది! ఈ మేరకు ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

గాజియాబాద్​కు చెందిన దీపాళీ త్యాగి 2019, మార్చి 21న సదరు ఔట్​లెట్​ నుంచి శాకాహారం పిజ్జాను ఆర్డర్​ చేసింది. అయితే.. "చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాన ఇవ్వడం వల్ల రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహారం పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే.. సదరు ఔట్​లెట్​ మేనేజర్​ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు." అని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

వీటికి సమాధానం కోరుతూ దిల్లీకి చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​ సదరు ఔట్​లెట్​కు నోటీసులు జారి చేసింది.

ఇదీ చూడండి:పెళ్లి విందుకు చేసే రోటీలపై ఉమ్మిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.