ETV Bharat / bharat

Woman Skeleton In Mortuary : మూడేళ్లుగా మార్చురీలోనే ఓ మహిళ అస్థిపంజరం.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 5:53 PM IST

Woman Skeleton In Mortuary Allahabad High Court : బతికున్న వారికి కూడా రాజ్యాంగం హక్కులు కల్పిస్తుందని అలహాబాద్​ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చనిపోయిన వారి మౌనం వారి గొంతుకలను అణచివేయలేదని.. వారి హక్కులను హరించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుండా ఓ మహిళ అస్తిపంజరాన్ని మూడేళ్ల పాటు మార్చురీలో ఉంచిన ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

Woman Skeleton In Mortuary Allahabad High Court
Woman Skeleton In Mortuary Allahabad High Court

Woman Skeleton In Mortuary Allahabad High Court : 'బతికున్న వారి లానే చనిపోయిన వ్యక్తికి కూడా సమాన హక్కులు ఉంటాయి. చట్టం అనేది బతికున్న వారికి మాత్రమే కాదు.. అది చనిపోయిన వారికి కూడా వర్తిస్తుంది'... ఇవి అలహాబాద్​ హైకోర్టు ఆవేదనతో అన్న మాటలు. ఒక మహిళ అస్థిపంజరాన్ని మూడేళ్ల పాటు మార్చురీలో ఉంచిన ఉదంతంపై అసహనంతో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మీడియా నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాన్ని సీరియస్​గా తీసుకున్న హైకోర్టు.. సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఆదేశించింది.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రీతింకర్‌ దివాకర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ భానోత్‌ డివిజన్‌ ​​బెంచ్‌.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. 'సాధారణంగా.. మార్చురీల్లో ఉన్న మృతదేహాలకు ఎలా అంత్యక్రియలు జరిపిస్తారు? ఈ అస్థిపంజరం విషయంలో ఇంత జాప్యం జరగడానికి కారణం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలో మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయాలనే నిబంధన ఏదైనా ఉందా?' అని ప్రశ్నించింది. ఈ కేసులో దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో, మృతదేహాన్ని భద్రపరిచిన టైమ్​లైన్​ను తెలియజేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించిన కేసు డైరీని, డీఎన్​ఏ పరీక్షల కోసం పంపిన నమూనాలను, దాని నివేదికను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు బార్​ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ నితిన్ శర్మను అమికస్ క్యూరీగా నియమించి కోర్టుకు సహాయపడాలని ఆదేశించింది. అయితే, మహిళ అస్థిపంజరం తప్పిపోయిన తమ కుమార్తె రిటాదే అని ఓ కుటుంబం పేర్కొంది. కానీ డీఎన్​ఏ పరీక్షలో అది నిర్ధరణ కాలేదు.

'కోర్టులు చనిపోయిన వారి హక్కులకు కాపలాదారులు'
'బతికున్న వారి గౌరవం, చనిపోయిన వ్యక్తి గౌరవం అని విడదీస్తే.. గౌరవం అనే పదానికున్న అర్థం పోతుంది. చనిపోయిన వారి గౌరవం సురక్షితం కాకపోతే.. జీవించి ఉన్న వారి గౌరవం కూడా సురక్షితం కాదు. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వకపోతే.. బతికున్న వారికి కూడా ఇవ్వరు. రాజ్యాంగం చనిపోయిన వారికి సంరక్షకుడు, చట్టం వారి సలహాదారు, న్యాయస్థానాలు వారి హక్కులకు కాపలాదారులు. కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తులను, జీవించి ఉన్నవారు అసంబద్ధంగా పరిగణిస్తారు. కానీ చనిపోయినవారు రాజ్యాంగ రక్షణను ఎప్పటికీ కోల్పోరు' అంటూ మరణించినవారి హక్కులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా చనిపోయిన వారి మౌనం వారి గొంతుకలను అణచివేయలేదని.. వారి హక్కులను హరించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. చనిపోయిన వ్యక్తులకు కూడా వారి హక్కులు ఉన్నాయని.. వారు బతికున్న వారికన్నా ఏం తక్కువ కాదని తెలిపింది. ఈ లాజిక్​ ప్రకారం భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం నుంచి పొందిన ప్రతిష్ఠ హక్కు.. చనిపోయిన వ్యక్తులకు కూడా ఉంటుంది అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్​ 31కు వాయిదా వేసింది.

ఏనుగు మృతిపై ఎన్​జీటీ సీరియస్.. సుమోటోగా స్వీకరణ

'అత్యంత అయోమయ స్థితిలో దేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.