భార్యాపిల్లలు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. రైలు ఢీకొని ఇద్దరు లోకో పైలట్లు మృతి!

author img

By

Published : Nov 19, 2022, 5:38 PM IST

Wife refuses  husband meet kids

తన పిల్లల్ని చూడనివ్వట్లేదని భార్య ఇంటికి నిప్పు పెట్టాడు ఓ భర్త. భార్యాపిల్లలను రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. ఝార్ఖండ్​లోని జరిగిన మరో ఘటనలో రైలు ఢీకొని ఇద్దరు లోకో పైలట్లు మరణించారు.

పిల్లల్ని చూడడానికి అనుమతించలేదని భార్య ఇంటికి నిప్పుపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. దొడ్డబీకనహళ్లి గ్రామంలో రంగస్వామి, గీత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈ దంపతులిద్దరి మధ్య ఆస్తి కారణంగా వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు గోరూరు పోలీస్​ స్టేషన్​లో కేసులు కూడా పెట్టుకున్నారు. దీంతో నాలుగు నెలలుగా విడిగా ఉంటున్నారు. కాగా రంగస్వామీ తరచూ పిల్లల్ని చూడటానికి గీత ఉంటున్న ఇంటికి వస్తుండేవాడు. అలాగే శుక్రవారం కూడా వచ్చాడు. కానీ పిల్లల్ని చూడటానికి గీత అంగీకరించలేదు. అనంతరం కోపోద్రిక్తుడైన రంగస్వామి.. అర్ధరాత్రి వేళ తన భార్య పిల్లలు పడుకున్న సమయంలో పెట్రోల్​తో ఇంటికి నిప్పంటించాడు. ఇది గమనించిన స్థానికులు గీతతో పాటు ఇద్దరు పిల్లల్ని రక్షించారు. మంటల్లో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రంగస్వామిని అరెస్టు చేశారు.

లోకో పైలట్లు దుర్మరణం..
రైలు​ ఢీకొని ఇద్దరు లోకోపైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకోపైలట్ డీకే సహాన (53), అసిస్టెంట్​ లోకోపైలట్​ మహ్మద్​ అఫ్సర్ ఆలమ్(36) చక్రధర్​పుర్​ రైల్వే డివిజన్​లో పని చేస్తున్నారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి గూడ్స్​ రైలు ఇంజిన్ మార్చడానికి కిందికు దిగారు. ఈ క్రమంలోనే మరో ట్రాక్​పై వేగంగా వస్తున్న హౌరా-ముంబయి​ మెయిల్ వారిని ఢీకొంది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేసిబ్బంది.. చక్రధర్​పుర్​ రైల్వే ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై దర్యాప్తునకు అదేశించారు రైల్వే డివిజన్ అధికారులు. కాగా ఈ ఇంజిన్ మరమ్మతు చేస్తున్న సిబ్బందికి.. పక్క ట్రాక్​లో మరో రైలు వస్తుందనే సమాచారం ఎందుకు అందలేదో.. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో అనే విషయాలు దర్యాప్తు పూర్తైన తర్వాత తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి : 'జైలులో మంత్రికి మసాజ్'పై భాజపా ఫైర్.. ఫిజియోథెరపీలో భాగమేనన్న ఆప్

ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత దివ్యాంగురాలిని వివాహమాడిన ప్రియుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.