ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అలా చూసినందుకే!

author img

By

Published : Jan 9, 2023, 11:14 AM IST

Updated : Jan 9, 2023, 11:50 AM IST

wife kills husband with lover
భర్తను హత్య చేసిన భార్య

తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ మహిళ. ఈ దారుణం గుజరాత్​లో జరిగింది.

గుజరాత్​లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అహ్మదాబాద్​కు చెందిన మయూర్​​కు మీరా అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మయూర్​ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మయూర్ తన కుటుంబంతో కలిసి రాజస్థాన్​కు విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో మీరా వేరే వ్యక్తితో సన్నిహతంగా ఉండడం ఆమె కుమారుడు గమనించాడు. అంతేకాకుండా మీరా ఒంటరిగా తన ప్రియుడు అనస్​తో కలిసి షికారుకి వెళ్లిందని మీరా కుమారుడు మయూర్​కు చెప్పాడు.

విహారయాత్ర నుంచి అహ్మదాబాద్ చేరుకున్నాక భార్యను మయూర్​ నిలదీశాడు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది మీరా. మయూర్​ను పొలంలోకి పిలిచారు మీరా ప్రియుడు అనస్​, స్నేహితురాలు ఖుషీ. అనంతరం పదునైన ఆయుధంతో మయూర్​ను పొడిచి హత్య చేసి అక్కడే ఉన్న బావిలో పడేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు.

లిఫ్ట్​ కూలి ముగ్గురు మృతి..
దిల్లీలోని నరైనా ప్రాంతంలో లిఫ్ట్​ కూలి ముగ్గురు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి గుట్కా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితులు లిఫ్ట్‌లో వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాధితులను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

40 మంది విద్యార్థులపై దాడి..
విద్యార్థుల పట్ల ఓ ఉపాధ్యాయుడు పాశవికంగా ప్రవర్తించాడు. ప్రార్థనకు 10 నిమిషాలు ఆలస్యం అయ్యారని 40 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. ఈ ఘటన గుజరాత్​.. వల్సాద్​ జిల్లాలోని ధరంపుర్​లో జరిగింది. కర్ర విరిగేవరకు ఉపాధ్యాయుడు తమ పిల్లల్ని కొట్టాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ధరంపుర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 'ఉపాధ్యాయుడు విద్యార్థులపై దాడి చేయడం వల్ల కాళ్లు, చేతులు వాచిపోయాయి. నడవలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థులు ఉన్నారు.' అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా విద్యాశాఖ అధికారులు.

పోలీసులు, దొంగల మధ్య కాల్పులు..
పంజాబ్​లోని జలంధర్​లో పోలీసులు, దొంగల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, ముగ్గురు దొంగలు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు దొంగలను జలంధర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి బ్యాంక్ ఉద్యోగి.. క్రెటా కారును దొంగిలించి పారిపోయారు. ఈ క్రమంలో పోలీసులు జలంధర్‌ చేరుకుని దుండగులపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో కమల్​దీప్ బజ్వా అనే కానిస్టేబుల్ మృతి చెందారు.

Last Updated :Jan 9, 2023, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.