ETV Bharat / bharat

'డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనేందుకు చర్యలేవి?'

author img

By

Published : Jun 25, 2021, 2:32 PM IST

కరోనా వైరస్ డెల్టా వేరియంట్​ను ఎలా నియంత్రిస్తారో తెలపాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. కేంద్రాన్ని ప్రశ్నించారు. వైరస్​ను అడ్డుకునేందుకు ఇప్పటివరకు పెద్దఎత్తున పరీక్షలు ఎందుకు చేపట్టడం లేదో సమాధానం చెప్పాలని కోరారు.

rahul ghandi
రాహుల్​ గాంధీ

భారత్​లో అంతకంతకు విస్తరిస్తున్న డెల్టా ప్లస్​ వేరియంట్​ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీ.. అధికార భాజపాను ప్రశ్నించారు. కొత్త వేరియంట్​పై ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పుడు బహిర్గతం చేస్తారో వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

  • डेल्टा प्लस वेरिएंट पर मोदी सरकार से प्रश्न-

    - इसकी जाँच व रोकथाम के लिए बड़े स्तर पर टेस्टिंग क्यों नहीं हो रही?

    - वैक्सीन इसपर कितनी प्रभावशाली हैं व पूरी जानकारी कब मिलेगी?

    - तीसरी लहर में इसे नियंत्रित करने का क्या प्लान है?

    — Rahul Gandhi (@RahulGandhi) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" డెల్టా ప్లస్​ వేరియంట్​ను మోదీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చెప్పాలి. దీనిపై టీకాల ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది బయటపెట్టాలి. మూడోదశను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికను వివరించాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

డెల్టా ప్లస్​ వేరియంట్​పై మోదీ ప్రభుత్వానికి ట్విట్టర్​ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు రాహుల్​. కొత్త వేరియంట్​ను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో కేంద్రం ఎందుకు పరీక్షలు చేపట్టడం లేదని అడిగారు.

ఇదీ చూడండి: టీకాలు డెల్టాప్లస్​ వేరియంట్​ను అడ్డుకోలేవా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.