India 100 crore vaccine: భారత్​కు డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు!

author img

By

Published : Oct 21, 2021, 3:09 PM IST

India 1 Billion Doses

కొవిడ్ టీకా పంపిణీలో 100కోట్ల డోసులను(India 100 crore vaccine) భారత్​ పూర్తి చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సంతోషం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు భారత్​ చేస్తున్న కృషిని కొనియాడింది. మరోవైపు.. తక్కువ వ్యవధిలోనే భారత్ ఈ ఘనత(Vaccine Milestone) సాధించడంపై భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సాధించిన ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రశంసించింది. తాజాగా 100కోట్ల డోసులను పూర్తి చేయడం(India 100 crore vaccine) పట్ల సంతోషం వ్యక్తం చేసింది. 'కొవిడ్‌ 19 మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడం సహా వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలకు(Vaccine Milestone) భారత ప్రధాని, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు అభినందనలు' అని డబ్ల్యూహెచ్​ఓ(Who On India Vaccination) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్‌ స్పందించారు.

"100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసి మరో కీలక మైలురాయిని సాధించినందుకు భారత్‌కు అభినందనలు. బలమైన నాయకత్వం, వివిధ రంగాల మధ్య సమన్వయం, ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కృషి, ప్రజలందరి భాగస్వామ్యం లేకుండా తక్కువ సమయంలో ఇంతటి అసాధారణ ఘనత సాధించడం సాధ్యం కాదు. భారత్‌ సాధించిన ఈ పురోగతి కేవలం వ్యాక్సిన్‌ పంపిణీలో నిబద్ధతనే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడే ఈ వ్యాక్సిన్‌లను ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉండేలా చూసే ప్రయత్నాల కోణంలో చూడాలి."

-పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌, డబ్ల్యూహెచ్​ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌

సీరం ఇన్‌స్టిట్యూట్‌ హర్షం..

భారత్‌లో 100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను(India 1 Billion Doses) విజయవంతంగా పంపిణీ చేయడం పట్ల సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. 'మీ నాయకత్వంలో ఈ రోజు భారత్‌ ఈ ఘనత సాధించిందని' మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇందులో భాగస్వామ్యమైన ఇతర సంస్థలతో పాటు ఇందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి అదర్‌ పూనావాలా అభినందనలు తెలిపారు.

అభినందించిన భారత్‌ బయోటెక్‌..

కేవలం తొమ్మిది నెలల కాలంలోనే భారత్‌ ఈ అసాధారణ ఘనత (India 100 crore vaccine) సాధించడం పట్ల భారత్‌ బయోటెక్‌ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ చారిత్రక కార్యక్రమంలో(India 1 Billion Doses) భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు, దేశ పౌరుల సహకారంతోనే ఆత్మనిర్భరతలో భారత్‌ విజయం సాధించింది' అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

అమెరికా రాయబార కార్యాలయం ప్రశంసలు

భారత్​ టీకా పంపిణీలో 100కోట్ల డోసుల మైలురాయిని (India 100 crore vaccine) చేరుకోవడం పట్ల భారత్​లోని అమెరికా రాయబార కార్యాలయం అభినందనలు తెలిపింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో ఇదో కీలకమైన ఘట్టం అని అభివర్ణించింది.

ఇవీ చూడండి:

Vaccine Milestone: దేశంలో టీకా పంపిణీ సాగిందిలా..

చరిత్ర సృష్టించిన భారత్​.. టీకా పంపిణీ@100కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.