ETV Bharat / bharat

ఆపరేషన్​ తపోవన్​: సొరంగానికి రంధ్రం

author img

By

Published : Feb 13, 2021, 12:56 PM IST

ఉత్తరాఖండ్​ ఆకస్మిక జలప్రళయంలో గల్లంతైనవారి ఆచూకీని కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా సహాయక బృందాలు పురోగతి సాధించాయి. వరద కారణంగా తపోవన్ సొరంగంలో కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు దానికి రంధ్రం చేశారు.

uttarakhand-avalanche-tragedy-total-thirty eight bodies-recoverd-from-various-sites
వెలికితీసిన 38 మృతదేహాల్లో.. గుర్తించినవి 12మాత్రమే

ఉత్తరాఖండ్​ ఆకస్మిక జలప్రళయంలో తీవ్రంగా ప్రభావితమైన జోషీమఠ్​, చమోలీ జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రిల్లింగ్ ఆపరేషన్​ ద్వారా ఎట్టకేలకు తపోవన్ సొరంగానికి రంధ్రం చేయగలిగారు. దీంతో సుదీర్ఘ సహాయక చర్యల్లో ముందడుగు పడినట్టైంది.

పురోగతి..

బురదతో నిండిపోయిన తపోవన్ సొరంగంలో 30 మందికి పైగా చిక్కుకుని ఉంటారని రెస్క్యూ బృందాలు మొదటినుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. అందులో మనుషులున్నారా లేరా అనే విషయాన్ని కనుగొనేందుకు సొరంగంలోకి కెమెరాను పంపాలని నిర్ణయించారు. దీనికోసం శనివారం మరింత పెద్ద రంధ్రం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

''75 మీటర్ల వెడల్పు.. 12 మీటర్ల పొడవైన సొరంగానికి విజయవంతంగా రంధ్రం చేయగలిగాం. సొరంగంలో నీరు, బురద లేదని.. లోపల చిక్కుకున్న వారు క్షేమంగా ఉంటారనేందుకు ఇది మంచి సంకేతం.''

-ఆర్.పీ అహీర్‌వాల్, ఎన్‌టీపీసీ తపోవన్ జనరల్​ మేనేజర్

ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 38 మృతదేహాలను వెలికి తీయగా, 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు ఆకస్మిక వరదల అనంతరం రిషిగంగ ఎగువ ప్రాంతంలో ఏర్పడిన సరస్సుపై నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది.

12 మంది గుర్తింపు: డీఎమ్

మృతుల్లో ఇప్పటివరకు 12మందిని గుర్తించామని, మరో 26 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్​ స్వాతి భదౌరియా తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్​ఎఫ్)​, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​), ఐటీబీపీ సహా ఇతర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌: కలవరపెడుతోన్న 'డేంజర్‌ లేక్‌'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.