ETV Bharat / bharat

H1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అమెరికాలోనే వీసా రెన్యువల్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 7:45 PM IST

US To Launch H1B Visa Renewal Program In December In Telugu : H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత నిపుణులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై హెచ్​1బీ వీసాదారులు తమ స్వదేశాలకు వెళ్లకుండా.. అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా.. ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబరులో ప్రారంభించనుంది. దీనితో 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది.

US To Launch H1B Visa Renewal Programme In December
H1B Visa Renewal Programme in USA

US To Launch H1B Visa Renewal Program In December : అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. యూఎస్​ ప్రభుత్వం హెచ్​1 బీ వీసా (H1B Visa) రెన్యువల్​ విధానాన్ని మరింత సరళీకరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొన్ని కేటగిరీల హెచ్​1బీ వీసాలను.. అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలుకల్పిస్తూ.. డిసెంబర్​లో ఓ పైలట్​ ప్రోగ్రామ్ (డొమెస్టిక్​ వర్క్​ వీసా రెన్యువల్​) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

20 వేల మందికి బెనిఫిట్​!
డిసెంబర్​లో ప్రారంభం కానున్న ఈ పైలట్ ప్రోగ్రామ్​ 3 నెలలపాటు అందుబాటులో ఉంటుందని.. వీసా సర్వీసెస్​ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు. ఈ పైలట్ ప్రోగ్రామ్​ కింద తొలత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

భారతీయుల పరిస్థితి ఏమిటి?
'భారత్​లో H1B వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతీయులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్​మెంట్​లు ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే.. అమెరికాలోనే H1B వీసా రెన్యువల్ చేసేందుకు ఒక పైలట్ ప్రోగ్రామ్​ ప్రారంభిస్తున్నాం. డిసెంబర్​ నుంచి 3 నెలలపాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. కనుక అమెరికాలో ఉన్న హెచ్​1బీ వీసాదారులు తమ స్వదేశాలకు వెళ్లకుండానే.. తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. తొలుత ఈ పైలట్ ప్రోగ్రామ్​ కింద 20 వేల మందికి వీసాలు పునరుద్ధరిస్తాం. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారని భావిస్తున్నాం. అంతేకాదు.. ఈ వీసా రెన్యువల్​ ప్రోగ్రామ్​ను క్రమక్రమంగా విస్తరిస్తాం' అని యూఎస్​ వీసా సర్వీసెస్​ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ పేర్కొన్నారు.

ఈ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... భారతీయులు తమ వీసా అపాయింట్​మెంట్​ కోసం ఇండియా రావాల్సిన అవసరం ఉండదు అని జూలీ తెలిపారు. అంతేగాక, దీని వల్ల భారత్​లోని అమెరికన్​ దౌత్య కార్యాలయాలు.. కొత్త వీసా దరఖాస్తులపై దృష్టి సారించడానికి వీలవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

త్వరలోనే..
వీసా రెన్యువల్ పైలట్ ప్రోగ్రామ్​ గురించి త్వరలోనే అధికారిక నోటీసులు జారీ చేస్తామని, ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలను కూడా వెల్లడిస్తామని జూలీ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్‌ను కేవలం హెచ్‌1బీ కేటగిరీ వర్క్‌ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

స్టూడెంట్‌ వీసాలకు కొత్త రూల్స్‌
అమెరికా.. విదేశీ నిపుణుల కోసం హెచ్​1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. అయితే ఈ వీసాలను వినియోగిస్తున్నవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గతంలో హెచ్​1బీ వీసా తీసుకున్నవారు.. దానిని రెన్యువల్ చేసుకోవడం కోసం, స్టాంపింగ్ కోసం తమ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ 2004 తరువాత ఆ విధానంలో చాలా మార్పులు చేశారు. దీనితో హెచ్​1బీ వీసా ఉన్నవారు.. దానిని రెన్యువల్ చేసుకోవడం కోసం తమ స్వదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు తమ స్వదేశంలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇది పెద్ద ప్రహసనంగా మారిపోయింది. చాలా సార్లు ఈ స్టాంపింగ్ కోసం, వీసా అపాయింట్​మెంట్​ల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఈ డొమెస్టిక్ వర్క్​ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్​ను ప్రారంభించాలని అమెరికా నిర్ణయించింది.

1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ!
అమెరికాలో ఉన్నత చదువు కోసం వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో 1,40,000 మందికి పైగా భారతీయ విద్యార్థులకు.. అమెరికా స్టూడెంట్​ వీసాలు జారీ చేసినట్లు జూలీ వెల్లడించారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు.. భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ సమయాన్ని కూడా తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

డిసెంబర్​ 1 నుంచి న్యూ సిమ్​ కార్డ్ రూల్స్ - ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు పెనాల్టీ/ జైలు శిక్ష!

LIC నయా పాలసీ - జీవితాంతం ఆదాయం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.