ETV Bharat / bharat

ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి!

author img

By

Published : Oct 12, 2022, 10:50 AM IST

ten year old aadhar card updateaadhar update online
ten year old aadhar card update

Aadhar Card Update: ఆధార్​ కార్డ్ తీసుకుని పదేళ్లు దాటిందా? అప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయలేదా? అయితే.. ఈ వార్త మీకోసమే.

Aadhar Card Update: ఆధార్​ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాల్ని మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ సూచించింది. గత పదేళ్లలో ఆధార్​ను ఒక్కసారి కూడా అప్డేట్​ చేయని వారు ఈ పని చేయాలని కోరింది. అయితే.. ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్​ డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది యూఐడీఏఐ.

"పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్​' పోర్టల్​ లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు" అని ఓ ప్రకటనలో పేర్కొంది యూఐడీఏఐ.

దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్​ కార్డులు జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్​ను ఉపయోగిస్తోంది కేంద్రం.

ఇవీ చదవండి: స్వదేశీ ఆయుధాలపై భారత్ ప్రత్యేక దృష్టి.. ఇక శత్రుదేశాలకు చుక్కలే!

పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి.. అంతా ఉచితం.. ఎక్కడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.