ETV Bharat / bharat

పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి.. అంతా ఉచితం.. ఎక్కడంటే..?

author img

By

Published : Oct 11, 2022, 8:31 PM IST

మనుషులకు జబ్బు చేసినా, నొప్పి పుట్టినా ఇతరులకు చెప్పుకుంటారు. నోరులేని జీవులకు ఆ భాగ్యం లేదు. ఏం జరిగినా నిశబ్దంగా భరిస్తూనే ఉంటాయి. కానీ అతికొద్ది మందికి మాత్రమే వాటి మౌన రోదన అర్థమవుతుంది. అలాంటి జంతు ప్రేమికులు పక్షుల కోసం ఏకంగా ఓ పెద్ద ఆస్పత్రినే నిర్మించి వాటికి సేవ చేస్తున్నారు.

Ludhiana ancient Goshala
పంజాబ్‌లోని పురాతన గోశాల

పక్షులను ఆదుకోవడమే లక్ష్యంగా పంజాబ్‌లోని ఓ పురాతన గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆస్పత్రి నిర్మించారు. పావురాలు, చిలకలు, పిచ్చుకల లాంటి అనేక పక్షులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పక్షులు ఎగిరి పోయేంత ఆరోగ్యంగా ఉంటేనే వాటిని తిరిగి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. అలా లేని వాటిని వారి సంరక్షణలోనే ఉంచుకుని కొన్ని వేల పక్షులకు సేవ చేస్తున్నారు. లుధియానా గోషాల నిర్వాహకులు.. ఇందుకోసం కొంతమంది జంతుప్రేమికుల దగ్గర్నుంచి విరాళాలు సేకరిస్తుంటారు.

..
పక్షుల ఆస్పత్రి

విరాళాలను ఉపయోగించి తీవ్ర అనారోగ్యంలో ఉన్న పావురాలు, పిచ్చుకలు, చిలుకల కోసం ఏకంగా ఓ ఐసీయూ వార్డునే ఏర్పాటు చేశారు. ఇళ్లలో పెంచుకునే పక్షులతోపాటు నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షులను ఎవరైన తీసుకొస్తే ఎలాంటి రుసుము తీసుకోకుండా చికిత్స చేస్తారు. పక్షుల కోసం ఆస్పత్రి ప్రాంగణంలో తిండి గింజలు, నీటిని ఏర్పాటు చేశారు. వాటి కోసం వచ్చిన పక్షుల్లో ఏవైనా జబ్బుపడి ఉంటే వాటికీ చికిత్స చేస్తారు.

..
పక్షులు

పర్యావరణ కాలుష్యం, రేడియేషన్‌ వంటి కారణాలతో పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లుధియానా గోషాల నిర్వాహకులు.. తమకు శక్తి ఉన్నంత వరకు ఈ సేవలు చేస్తూనే ఉంటామని వివరించారు. తమ గోశాలకు వచ్చిన నిధుల్లో కొంత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు.. స్థలం ఖాళీ చేయాలని ఆదేశం.. అసలేమైంది?

డబ్బుకు ఆశపడి నరబలి.. ఇద్దరు మహిళల హత్య.. తల్లి ఎదుటే కుమార్తెపై గ్యాంగ్​రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.