ETV Bharat / bharat

స్టాలిన్‌ కుమారుడి 'స్వీటు' ఇంటర్వ్యూ!

author img

By

Published : Mar 7, 2021, 1:42 PM IST

Updated : Mar 8, 2021, 6:08 AM IST

ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించే అభ్యర్థులు ఎంతోమంది ఉంటారు. వారందరి గెలుపు అవకాశాలను బేరీజు వేసి పార్టీలు టికెట్లు ఖరారు చేస్తుంటాయి. అయితే తమిళనాడులోని డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్​ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ సీటు కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

udayanidhi stalin has been interviewed by his father dmk chief stalin
స్టాలిన్‌ కుమారుడి 'స్వీటు' ఇంటర్వ్యూ!

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ పార్టీకి గతంలో దరఖాస్తు చేసుకున్నారు.

udayanidhi stalin
'స్టాలిన్'​ ఇంటర్వ్యూ

ఆశావహుల జాబితాలో ఉన్న ఉదయనిధిని.. పార్టీ ప్రధాన కార్యాలయమైన అణ్ణా అరివాలయంలో ఆయన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్​లు శనివారం ఇంటర్వ్యూ చేశారు.

ఇదీ చదవండి: తమిళనాట 25 చోట్ల బరిలో కాంగ్రెస్​

Last Updated : Mar 8, 2021, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.