ETV Bharat / bharat

కాఫీ తోటలో కార్మికులపై ఏనుగు దాడి- ఇద్దరు మృతి

author img

By

Published : Mar 12, 2022, 12:06 PM IST

Elephant Attack in Karnataka: కర్ణాటకలో అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. హసన్ జిల్లాలోని కాఫీ ఎస్టేట్​లో కార్మికులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

Elephant Attack in Karnataka
ఏనుగు బీభత్సం

Elephant Attack in Karnataka: కర్ణాటకలోని ఓ కాఫీ ఎస్టేట్​ కార్మికులపై ఏనుగు దాడి చేసింది. హసన్ జిల్లా జరిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను చిక్కయ్య(65), ఎర్రయ్య(68) గుర్తించారు.

కడగెర్జీ గ్రామంలోని శారద ఎస్టేట్ కాఫీతోటలో జరిగిన ఈ విషాద ఘటనతో పనికి వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. వారం రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు కనిపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వన్యప్రాణుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అటవీశాఖపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏనుగు దాడిలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: పర్యటకులపై ఏనుగు దాడి.. సఫారీ వాహనం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.