ETV Bharat / bharat

TSRTC Special Buses to Vijayawada For Dasara 2023 : హైదరాబాద్​ టూ విజయవాడ.. ప్రత్యేక బస్సులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 3:14 PM IST

TSRTC Special Buses to Vijayawada For Dasara 2023 : దసరా పండగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారికి టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండానే.. అక్టోబర్ 18 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.

TSRTC Special Buses to Vijayawada For Dasara 2023
TSRTC Special Buses to Vijayawada For Dasara 2023

TSRTC Special Buses to Vijayawada For Dasara 2023 : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండుగల్లో దసరా ఒకటి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు, చదువుకునే వారు అందరు పండుగకు సొంత ఊరికి వెళ్లాలనుకుంటారు. అందుకోసం కొందరు రైలు మార్గాన్ని ఆశ్రయిస్తే.. మరికొందరు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఊళ్లకు వెళ్తారు. దీంతో.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి విజయవాడకు 24 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.

TSRTC Special Buses For Dussehra 2023 : ఇవాళ్టి నుంచే దసరా స్పెషల్ బస్సులు రయ్​రయ్.. లగేజీపై 20% డిస్కౌంట్

Tsrtc Special Bus Booking : ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి విజయవాడ వెళ్లాలనుకునే వారికోసం ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం 24 సర్వీస్‌లను కేటాయించింది. బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ (MGBS) నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయంచింది. ఆ సర్వీసులు కేపీహెచ్‌బీ (KPHB) కాలనీ, బాలానగర్, బోయిన్‌పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి.

Tsrtc Special Buses : ప్రత్యేక సర్వీస్‌లలో టిక్కెట్ ఛార్జీలో కూడా ఎలాంటి మార్పూ ఉండదని తెలంగాణ ఆర్‌టీసీ తెలిపింది. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌ ప్రాంతాల నుంచి బస్సులు ఎంజీబీఎస్‌ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్‌, సికింద్రాబాద్‌, వాటి పరిసరాల్లో నివసించే ప్రయాణికులు ఈ బస్సుల కోసం ఎంజీబీఎస్‌కు రావాల్సి వస్తోంది. దీంతో.. వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేబీఎస్ నుంచి బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్వీసుల వల్ల బోవెన్‌పల్లి, సికింద్రాబాద్‌, జేబీఎస్‌, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఉండే వారికి ఎంతగానో ఉపయోగపడతాయని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ సేవల కోసం వినియోగించడానికి tsrtconline.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది.

ఇప్పటికే అదనపు బస్సులు..

Tsrtc Special Bus For Festivals 2023 : దసరా పండగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా.. 5,265 అదనపు బస్సులను వినియోగిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను అక్టోబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో.. 536 బస్సులలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని కూడా తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. ఇప్పుడు తాజాగా.. ఏపీలోని ప్రయాణికుల కోసం జేబీఎస్ నుంచి విజయవాడకు మరో 24 సర్వీసులను కేటాయించింది.

TSRTC Dussehra offer : దసరాకు సొంతూరుకు వెళ్తున్నారా.. ఇదిగో టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

How to Apply TSRTC Student Bus Pass : ఆన్​లైన్​లో బస్​పాస్​.. ఇంటి నుంచే పొందండిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.