ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా భాజపా పావులు!

author img

By

Published : Jun 26, 2021, 4:21 PM IST

Updated : Jun 26, 2021, 5:38 PM IST

2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలపై చర్చించేందుకు భాజపా అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కేంద్ర మంత్రులు, సహా ఆ పార్టీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు.

bjp for 2022 assembly elections
భాజపా భేటీ

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. భాజపా సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పలువురు కేంద్ర మంత్రులు సహా ఆ పార్టీ సీనియర్​ నేతలు.. దిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. ఈ సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహించగా.. కేంద్ర మంత్రులు అమిత్​ షా, నిర్మలా సీతారామన్​, నరేంద్ర సింగ్​ తోమర్​, స్మృతి ఇరానీ, కిరణ్​ రిజిజు తదితరులు పాల్గొన్నారని భాజపా వర్గాలు తెలిపాయి.

bjp meeting
భాజపా అగ్రనేతలతో జేపీ నడ్డా సమావేశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల సన్నాహంపైనే ప్రధానంగా తాము చర్చించామని భేటీ అనంతరం ఓ సీనియర్​ నేత తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపుర్​, గోవా రాష్ట్రాల్లో 2022 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్​ మినహా మిగతా రాష్ట్రాల్లో భాజపానే ప్రస్తుతం అధికారంలో ఉంది.

bjp leaders meeting
అగ్రనేతల సమావేశంలో పాల్గొన్న భాజపా సీనియర్​ నేతలు

ఈ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు భాజపా ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో ఈసారి ఎన్నికలు.. భాజపాకు కీలకంగా నిలవనున్నాయి.

ఇదీ చూడండి: ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా భాజపాకు రూ.276.45 కోట్లు!

ఇదీ చూడండి: కత్తులతో పొడిచి భాజపా నేత​ దారుణ హత్య

Last Updated : Jun 26, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.