ETV Bharat / bharat

టూల్​కిట్​ కేసు: 'ఆ సమాచారం లీక్​ కాకుండా చూడండి'

author img

By

Published : Feb 19, 2021, 3:11 PM IST

టూల్​కిట్​ కేసులో దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన విషయాలు పోలీసులుగానీ, మీడియా గానీ వెల్లడించకుండా ఆదేశించాలని న్యాయస్థానాన్ని దిశ రవి కోరింది. ఈ నేపథ్యంలో.. లీకైన సమాచారాన్ని ప్రసారం చేయరాదని మీడియా సంస్ధలకు హైకోర్టు సూచించింది.

Toolkit case
'ఆ వివరాలు ప్రసారం చేయొద్దని మీడియాను ఆదేశించలేం'

టూల్‌కిట్‌ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశ రవిపై దాఖలైన ఎఫ్​ఐఆర్​కు సంబంధించిన దర్యాప్తు సమాచారం విషయంలో కొన్ని మీడియా సంస్ధలపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వార్తలు సంచలనాత్మకంగా, వాస్తవ విరుద్ధమైనవిగా ఉన్నాయని పేర్కొంది.

దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్ కాకుండా చూడాలని దిశ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. దర్యాప్తుపై ప్రభావంపై చూపే అవకాశాలు ఉన్నందున లీకైన సమాచారాన్ని ప్రసారం చేయరాదని మీడియా సంస్ధలకు హైకోర్టు సూచించింది. మీడియా సంస్ధలకు దర్యాప్తు సమాచారాన్ని లీక్ చేయరాదని దిల్లీ పోలీసులను ఆదేశించింది. పోలీసులు.. మీడియా సంస్ధలకు లీక్‌ చేశారని భావిస్తున్న సమాచారం, పోలీసులు పోస్ట్‌ చేసిన ట్వీట్‌లను తొలగించేందుకు న్యాయస్ధానం నిరాకరించింది. దిల్లీ అన్నదాతల ఆందోళనకు సంబంధించిన టూల్‌కిట్‌ సమాచార వ్యాప్తి కేసులో దిశ రవిని ఈ నెల 13న అరెస్టు చేశారు.

ఇవీ చూడండి:

పర్యావరణం నుంచి 'దేశద్రోహం' వరకు.. ఎవరీ దిశ?

'టూల్​కిట్'​ అరెస్టులపై రాజకీయ రగడ

గ్రెటా 'టూల్​కిట్​' వ్యవహారంలో గూగుల్​ సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.