ETV Bharat / bharat

ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టుకు నికితా జాకబ్​

author img

By

Published : Mar 1, 2021, 8:36 PM IST

దిల్లీ రైతుల ఉద్యమానికి సంబంధించి టూల్​ కిట్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. నికితా జాకబ్​ ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు.

Toolkit case
ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టుకు నికితా జాకబ్​

టూల్​కిట్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది, పర్యావరణ వేత్త నికితా జాకబ్​ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్​ కోసం అప్పీల్​ చేసుకున్నారు. ఈ పిటిషన్​.. అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేందర్​ రాణా ముందుకు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.

ముంబయికి చెందిన నికిత ఫిబ్రవరి 17న బాంబే హైకోర్టు నుంచి ట్రాన్సిట్​ బెయిల్​ పొందారు. దీనికి 3 వారాల గడువు ఉంది.

ఇదీ కేసు..

దిల్లీ ఉద్యమంలో రైతుల నిరసనపై యువ పర్యావరణవేత్త గ్రెటా థన్​బర్గ్​తో పంచుకున్న టూల్​కిట్​​ కేసులో నికిత జాకబ్​, శంతను, దిశ రవిపై దిల్లీ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దిశ రవిని ఫిబ్రవరి 13న అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్​ ఇవ్వగా 23న విడుదలైంది.

ఇదీ చూడండి: తిహార్​ జైలు నుంచి దిశ రవి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.